చరణ్ గురించి చిరు టెన్షన్ పడ్డారట
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో సక్సెస్ అవుతాడా..? లేదా అని చిరంజీవి తెగ టెన్షన్ పడేవారట.ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్. బ్రూస్ లీ 2 చిత్రం ఆడియో ఫంక్షన్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాఘవ లారెన్స్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ..ఇంద్ర సినిమాలోని దాయి దాయి దామ్మా పాటకి కొరియోగ్రఫీ చేస్తున్న సమయంలో చిరంజీవిగారితో పాటు చరణ్ కూడా అక్కడే ఉన్నాడు.ఆ సమయంలో చరణ్ తో డాన్స్ చేయించు అని చిరంజీవి గారు చెప్పారు. చరణ్ డాన్స్ ఎలా చేస్తాడో అని చిరంజీవి గారు టెన్షన్ పడేవారు. చరణ్ డాన్స్ చూసి డాన్స్ ల్లో చరణ్ అదరగొట్టేస్తాడని అప్పుడే చిరంజీవిగారితో చెప్పాను అంటున్నాడు లారెన్స్. అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout