ఎప్పుడో చెప్పకుంటే లీక్ చేస్తా: కొరటాలకు చిరు వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై ఎస్. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ టెంపుల్ టౌన్ సెట్స్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడినప్పటికీ.. అన్‌లాక్ తర్వాత శరవేగంగా కొరటాల ఈ చిత్రాన్ని షూట్ చేస్తున్నారు.
ఇక చిరు మూవీ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ కోసం అయితే కళ్లు కాయలు కాసేలా అభిమానులు ఎదురు చూస్తున్నారు. నూతన సంవత్సరం రోజున, లేదంటే.. సంక్రాంతికి ఈ సినిమా టీజర్ వస్తుందని అభిమానులు భావించారు. కానీ ఎటువంటి అప్‌డేట్ రాలేదు. దీంతో అభిమానులే కాదు.. చిరంజీవి కూడా కాస్త నిరాశకు లోనైనట్లుగా తాజాగా ఆయన ట్వీట్ చూస్తే తెలుస్తోంది. కొరటాలకు చిరు స్వీట్ వార్నింగ్ ఇవ్వడం నెట్టింట్లో వైరల్ అవుతోంది. తనకు, కొరటాల శివకు మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణను చిరు తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.
చిరు, కొరటాల శివ మధ్య సంభాషణ..
చిరంజీవి: ఏమయ్యా కొరటాల.. ఆచార్య టీజర్ న్యూ ఇయర్‌కి లేదు, సంక్రాంతికి లేదు.. ఇంకెప్పుడు..
కొరటాల: సార్.. అదే పనిలో ఉన్నా..
చిరంజీవి: ఎప్పుడో చెప్పకపోతే.. లీక్ చేయడానికి సిద్ధంగా ఉన్నా..
కొరటాల: రేపు మార్నింగే అప్‌డేట్ ఇస్తా.. సార్..
చిరంజీవి: ఇస్తావా..
కొరటాల: రేపు మార్నింగ్ 10 గంటలకు ప్రకటన.. ఫిక్స్ సార్
మొత్తానికి ఈ సరదా సంభాషణతో రేపు మార్నింగ్ అంటే బుధవారం ఉదయం సరిగ్గా 10 గంటలకు ‘ఆచార్య’ టీజర్ రిలీజ్ అవుతుందని స్పష్టమైంది. ఈ సంభాషణ అనంతరం కొరటాల శివ కూడా 'ఆచార్య' టీజర్ ప్రకటన రేపు ఉదయం 10గంటలకు అంటూ ట్వీట్ చేశారు. దీంతో మెగాభిమానుల తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరు, కొరటాల మధ్య జరిగిన సరదా సంభాషణపై కూడా కామెంట్స్ బాగానే పడుతున్నాయి. అయితే అవి పాజిటివ్ కామెంట్సే కావడం విశేషం.
So here goes.. @sivakoratala @MatineeEnt@KonidelaPro @AlwaysRamCharan
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2021
#Acharya pic.twitter.com/YdZ84lkXhL
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments