చిరు - వినాయక్ ల ఠాగూర్ కు 13 ఏళ్లు..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి - డైనమిక్ డైరెక్టర్ వినాయక్ కాంబినేషన్లో రూపొందిన సెన్సేషనల్ మూవీ ఠాగూర్. ఈ చిత్రంలో చిరు సరసన శ్రియ, జ్యోతిక నటించారు. తమిళ్ లో మురుగుదాస్ తెరకెక్కించిన రమణ చిత్రాన్ని తెలుగులో వినాయక్ ఠాగూర్ టైటిల్ తో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. సంచలన విజయం సాధించిన ఠాగూర్ చిత్రం రిలీజై నేటికి 13 ఏళ్లు పూర్తయ్యింది.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో డైనమిక్ డైరెక్టర్ వినాయక్ ఖైదీ నెం 150 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.తమిళ్ మూవీ కత్తి సినిమా రీమేక్ గా ఖైదీ నెం 150 రూపొందుతుంది. చిరంజీవితో వినాయక్ చేసిన ఠాగూర్, ఖైదీ నెం 150 ఈ రెండు చిత్రాలు రీమేక్ మూవీస్ కావడం ఓ విశేషం అయితే....ఈ రెండు చిత్రాల మాతృక తమిళ్ చిత్రాలు కావడం...ఆ రెండు చిత్రాలను మురుగుదాసే తెరకెక్కించడం మరో విశేషం. ప్రస్తుతం ఖైదీ నెం 150 చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు.ఈ భారీ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్నిరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత వస్తున్న చిరు - వినాయక్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments