చిరంజీవి వర్సెస్ వెంకటేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ మధ్య పోటీ నడుస్తుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అసలు విషయమేమంటే.. వీరి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. అంతకు ముందు ఈస్టార్స్ పోటీ పడలేదా? అంటే పోటీపడ్డాయి. అయితే ఇలా ఇద్దరు స్టార్స్ పోటీ పడి ఇరవై ఏళ్లు అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చిరంజీవి, వెంకటేశ్‌లు గతంలో కలియుగ పాండవులు-చంటబ్బాయ్, రౌడీ అల్లుడు-క్షణంక్షణం, మాస్టర్-పెళ్లి చేసుకుందాం, అన్నయ్య-కలిసుందాం రా, మృగరాజు-దేవి పుత్రుడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. తర్వాత రెండు దశాబ్దాల వరకు వీరిద్దరి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద రాలేదు. ఇప్పుడు వస్తున్నాయి.
ఈ ఏడాది మే నెలలో చిరంజీవి ఆచార్య, వెంకటేశ్ నారప్ప సినిమాలు ఒకేసారి పోటీ పడుతున్నాయి. చిరంజీవి ఆచార్య మే 13న విడుదలవుతుంటే, వెంకటేశ్ నారప్ప మే 14న విడుదలవుతుంది. ఆచార్య దేవాదాయ శాఖలోని ప్రశించే కమర్షియల్ ఎంటర్ టైనర్ అయితే.. భూవివాదాలు, కులం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం నారప్ప. ఇందులో వెంకటేశ్ డిఫరెంట్ పాత్రలో, ఇద్దరు పిల్లల తండ్రిగా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com