చిరంజీవి వ‌ర్సెస్ వెంక‌టేశ్‌

మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్ మ‌ధ్య పోటీ న‌డుస్తుందా? అంటే అవున‌నే అంటున్నాయి సినీ వ‌ర్గాలు. అస‌లు విష‌య‌మేమంటే.. వీరి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డుతున్నాయి. అంత‌కు ముందు ఈస్టార్స్ పోటీ ప‌డ‌లేదా? అంటే పోటీప‌డ్డాయి. అయితే ఇలా ఇద్ద‌రు స్టార్స్ పోటీ ప‌డి ఇర‌వై ఏళ్లు అవుతుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. చిరంజీవి, వెంక‌టేశ్‌లు గతంలో క‌లియుగ పాండ‌వులు-చంట‌బ్బాయ్, రౌడీ అల్లుడు-క్షణంక్షణం, మాస్టర్-పెళ్లి చేసుకుందాం, అన్నయ్య‌-క‌లిసుందాం రా, మృగ‌రాజు-దేవి పుత్రుడు సినిమాలతో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీపడ్డారు. త‌ర్వాత రెండు ద‌శాబ్దాల వ‌ర‌కు వీరిద్ద‌రి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వ‌ద్ద రాలేదు. ఇప్పుడు వ‌స్తున్నాయి.

ఈ ఏడాది మే నెల‌లో చిరంజీవి ఆచార్య‌, వెంక‌టేశ్ నార‌ప్ప సినిమాలు ఒకేసారి పోటీ ప‌డుతున్నాయి. చిరంజీవి ఆచార్య మే 13న విడుద‌ల‌వుతుంటే, వెంక‌టేశ్ నార‌ప్ప మే 14న విడుద‌ల‌వుతుంది. ఆచార్య దేవాదాయ శాఖలోని ప్రశించే కమర్షియల్ ఎంటర్ టైనర్ అయితే.. భూవివాదాలు, కులం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం నారప్ప. ఇందులో వెంకటేశ్ డిఫరెంట్ పాత్రలో, ఇద్దరు పిల్లల తండ్రిగా నటిస్తున్నారు.

More News

సినీ ఇండ‌స్ట్రీకి కేంద్ర ప్ర‌భుత్వం వ‌రం..

కోవిడ్ ప్ర‌భావంతో దాదాపు ఎనిమిది నెల‌లు పాటు సినీ ప‌రిశ్ర‌మ కోలుకోలేని దెబ్బతింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నాయి.

ఏప్రిల్ 9న ‘వ‌కీల్ సాబ్‌’ రిలీజ్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో

'మ‌హాస‌ముద్రం' ఆగ‌స్ట్ 19న విడుద‌ల‌

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'మ‌హాస‌ముద్రం' ఆగ‌స్ట్ 19న విడుద‌ల కానున్న‌ది.

'ఖిలాడి' మే 28న విడుద‌ల‌‌

'క్రాక్' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, 'రాక్ష‌సుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో

మస్క్‌ను న్యాయస్థానంలో నిలబెట్టిన భారతీయ విద్యార్థి

ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ను ఓ భారతీయ అమెరికన్ విద్యార్థి న్యాయస్థానంలో నిలబెట్టగలిగాడు.