'రంగమార్తాండ' కు మెగాస్టార్ గాత్ర దానం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పుడు పెద్ద దిక్కుగా వున్నారు మెగాస్టార్ చిరంజీవి. 24 విభాగాల వారికి ఏ అవసరం వచ్చినా తానున్నాననే భరోసాను కలిపిస్తున్నారు. ఓ వైపు సేవా కార్యక్రమాలు, వివిధ ఫంక్షన్‌లకు గెస్ట్‌గా వెళ్లడం, తన సినిమాలు, వ్యాపార వ్యవహారాలతో ఆయన క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. చిరు గతంలో ఎన్నో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు గాత్రదానం కూడా చేశారు.
తాజాగా ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. ఇప్పుడీ చిత్రం కోసం మెగాస్టార్ గాత్రదానం చేశారు. ఈ విషయాన్ని కృష్ణవంశీ ట్విటర్ ద్వారా అధికారికంగా తెలియజేశారు. ఈ సందర్భంగా చిరు డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను ఆయన షేర్ చేస్తూ మెగాస్టార్‌కి ధన్యవాదాలు తెలియజేశారు.
మరాఠిలో విజయవంతమైన ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా తెలుగులో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో నాటకరంగ కళాకారుల జీవితాల్ని కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. ఇందులో ఓ నటుడి జీవితాన్ని గద్య కవిత ద్వారా ఆవిష్కరించనున్నారు. సినిమా ఆరంభంలో.. చివరిలో వచ్చే ఆ పదాల్ని చిరు తన గొంతుతో వినిపించనున్నారు. రంగమార్తాండకు ఇళయరాజా స్వరాలందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout