సోగ్గాడు గురించి చిరు, వెంకీ, మహేష్ కామెంట్స్...

  • IndiaGlitz, [Friday,March 18 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో నాగార్జున న‌టిస్తూ నిర్మించిన సోగ్గాడే చిన్ని నాయ‌నా ఎవ‌రు ఊహించ‌ని విధంగా 54 కోట్లు షేర్ సాధించ‌డం ఓ విశేష‌మైతే..110 సెంట‌ర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోవ‌డం మ‌రో విశేషం.
ఇంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమా ప్రేక్ష‌కుల‌నే కాదు స్టార్ హీరోల‌ను సైతం ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ విష‌యాన్నితాజాగా నాగార్జున స్వ‌యంగా తెలియ‌చేసారు.
ఇటీవ‌ల ఓ ఫంక్ష‌న్ లో చిరంజీవిని క‌ల‌సినప్పుడు ఇర‌వై నిమిషాలు మాట్లాడుకున్నాం. సోగ్గాడే చిన్ని నాయ‌నా చూసాను బాగుంది అన్నారు. అలాగే వెంకీ కూడా సినిమా చూసాను బాగుంది అన్నాడు. ఐఫా వేడుక‌లో మ‌హేష్ క‌లిసి వాట్ ఈజ్ దిస్ నాగ్...అమేజింగ్ ఫిల్మ్ అని మెచ్చుకున్నాడు అని నాగ్ త‌న సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.

More News

సుప్రీమ్ ఆడియో రిలీజ్ డేట్..

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్.

'ఊపిరి' సెన్సార్ పూర్తి...

నాగార్జున,కార్తీ,తమన్నా కీలక పాత్రల్లో నటించిన ‘ఊపిరి’మార్చి 25న విడుదల కానుంది.

నాకో ఇంకో పేరుంది అంటున్న సమంతా...

సమంత ఇంకో పేరు ఏమిటని తెగ ఆలోచిస్తున్నారా..?

బాలల హృదయాల్ని దోచుకున్న హీరో సంపూర్ణేష్ బాబు...

హృదయకాలేయం చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని ఏర్పర్చుకున్నాడు హీరో సంపూర్ణేష్ బాబు.తన దైన పాత్రలతో, వైవిధ్యమైన గెటప్పులతో అలరిస్తున్నాడు.

మాస్ హీరో విశాల్ హీరోగా 'టెంపర్' రీమేక్

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి కమర్షియల్విజయాలతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ హీరోగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి సూపర్ డూపర్ హిట్ అయిన ‘టెంపర్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు.