సోగ్గాడు గురించి చిరు, వెంకీ, మహేష్ కామెంట్స్...
- IndiaGlitz, [Friday,March 18 2016]
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నటిస్తూ నిర్మించిన సోగ్గాడే చిన్ని నాయనా ఎవరు ఊహించని విధంగా 54 కోట్లు షేర్ సాధించడం ఓ విశేషమైతే..110 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోవడం మరో విశేషం.
ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ప్రేక్షకులనే కాదు స్టార్ హీరోలను సైతం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ విషయాన్నితాజాగా నాగార్జున స్వయంగా తెలియచేసారు.
ఇటీవల ఓ ఫంక్షన్ లో చిరంజీవిని కలసినప్పుడు ఇరవై నిమిషాలు మాట్లాడుకున్నాం. సోగ్గాడే చిన్ని నాయనా చూసాను బాగుంది అన్నారు. అలాగే వెంకీ కూడా సినిమా చూసాను బాగుంది అన్నాడు. ఐఫా వేడుకలో మహేష్ కలిసి వాట్ ఈజ్ దిస్ నాగ్...అమేజింగ్ ఫిల్మ్ అని మెచ్చుకున్నాడు అని నాగ్ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.