తారక్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన చిరు, వెంకీ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న ఛాలెంజ్ ‘బీ ద రియల్ మేన్’. కరోనా దెబ్బకు దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలందరూ డిఫరెంట్ ఛాలెంజ్‌లను విసురుకుంటున్నారు. సందీప్ వంగా స్టార్ట్ చేసిన బీ ద రియల్‌మేన్ ఛాలెంజ్ బాగా వైరల్ అవుతుంది. సందీప్ వంగా, రాజమౌళి, తారక్, చరణ్, కీరవాణి, కొరటాల శివ, సుకుమార్ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. తారక్ ఛాలెంజ్ విసిరినవాళ్లలో చిరంజీవి, వెంకటేశ్ ఈరోజు ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ఈరోజు ఉదయం ఆయన హాలును శుభ్రం చేయడమే కాకుండా తల్లి అంజనాదేవీకి ఉప్మా, పెసరట్టు తయారు చేసిచ్చారు. ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘నేను రోజూ చేసే పనులే ఈవాళ మీకోసం’’ అంటూ మెసేజ్ చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, సూపర్‌స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు మణిరత్నంను నామినేట్ చేశారు. చిరంజీవి వీడియో పోస్ట్ కోసం తాను వేచి చూస్తున్నానని చెప్పిన విక్టరీ వెంకేటశ్.. చిరంజీవి వీడియో పోస్ట్ చేసిన అనంతరం వీడియో పోస్ట్ చేశారు. ‘‘ఇంటి పనుల్లో మన మహిళలకు సాయం చేయండి. బీ ద రియల్ మేన్’’ అని మెసేజ్‌తో పాటు చిన్నోడు మహేశ్, కోబ్రా వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడిని వెంకటేశ్ నామినేట్ చేశారు.
Here it is Bheem @tarak9999 నేను రోజు చేసే పనులే...ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం. And I now nominate @KTRTRS & my friend @rajinikanth #BeTheRealMan challenge. pic.twitter.com/y6DCQfWMMm
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 23, 2020
Here's my video @tarak9999.
— Venkatesh Daggubati (@VenkyMama) April 23, 2020
Let's help our family with domestic work and #BetheREALMAN
I request our Chinnodu @UrsTrulyMahesh, my cobra @IAmVarunTej & @AnilRavipudi to pass it on. pic.twitter.com/ILeH3Cm0Xq
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments