తార‌క్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన చిరు, వెంకీ

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతున్న ఛాలెంజ్ ‘బీ ద రియ‌ల్ మేన్‌’. క‌రోనా దెబ్బ‌కు దేశ‌మంత‌టా లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సినీ సెల‌బ్రిటీలంద‌రూ డిఫ‌రెంట్ ఛాలెంజ్‌ల‌ను విసురుకుంటున్నారు. సందీప్ వంగా స్టార్ట్ చేసిన బీ ద రియ‌ల్‌మేన్ ఛాలెంజ్ బాగా వైర‌ల్ అవుతుంది. సందీప్ వంగా, రాజ‌మౌళి, తార‌క్‌, చ‌ర‌ణ్‌, కీర‌వాణి, కొర‌టాల శివ‌, సుకుమార్ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. తార‌క్ ఛాలెంజ్ విసిరినవాళ్ల‌లో చిరంజీవి, వెంక‌టేశ్ ఈరోజు ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి విష‌యానికి వ‌స్తే ఈరోజు ఉద‌యం ఆయ‌న హాలును శుభ్రం చేయ‌డ‌మే కాకుండా త‌ల్లి అంజనాదేవీకి ఉప్మా, పెస‌ర‌ట్టు తయారు చేసిచ్చారు. ఆ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘నేను రోజూ చేసే పనులే ఈవాళ మీకోసం’’ అంటూ మెసేజ్ చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌, సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంను నామినేట్ చేశారు. చిరంజీవి వీడియో పోస్ట్ కోసం తాను వేచి చూస్తున్నాన‌ని చెప్పిన విక్ట‌రీ వెంకేట‌శ్.. చిరంజీవి వీడియో పోస్ట్ చేసిన అనంత‌రం వీడియో పోస్ట్ చేశారు. ‘‘ఇంటి పనుల్లో మన మహిళలకు సాయం చేయండి. బీ ద రియల్ మేన్’’ అని మెసేజ్‌తో పాటు చిన్నోడు మ‌హేశ్‌, కోబ్రా వ‌రుణ్ తేజ్‌, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడిని వెంక‌టేశ్ నామినేట్ చేశారు.


More News

స‌మంత ఈజ్ బ్యాక్‌

స‌మంత అక్కినేనికి ఏమైంది? అని చాలా రోజులుగా ఆమె అభిమానుల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌. సాధార‌ణంగానే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స‌మంత.. ఇప్ప‌డు కామ్ అయిపోయారు.

క్రియేటివిటీని పీక్స్‌లో చూపిస్తున్న పాయ‌ల్‌

హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ లాక్‌డౌన్ వ‌ల్ల వ‌చ్చిన క్వారంటైన్ టైమ్‌ను డిఫ‌రెంట్‌గా వాడుకుంటుంది. ఇంటిప‌నులు చేసుకుంటున్నాన‌ని

కిమ్.. మీరు బాగుండాలి.. : ట్రంప్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ (36)కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా వ్యాప్తి దృష్ట్యా అమర్ నాథ్ యాత్ర రద్దు

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. భారతదేశంలోనూ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయశక్తులా ప్రయత్నాలు

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో ఉపయోగం లేదు.. ప్రాణాలు పోతున్నాయ్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున వాడుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలో