చిరంజీవి, వెంకయ్యనాయుడుకి పద్మవిభూషణ్ పురస్కారం

  • IndiaGlitz, [Friday,January 26 2024]

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది పద్మ పురస్కారాలను(Padma Awards) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా అందులో ఐదుగురికి పద్మవిభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోనే అత్యున్నత రెండో పురస్కారమైన పద్మవిభూషన్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు దక్కింది. సినీ, సామాజిక రంగాల్లో చిరంజీవి చేసిన సేవలను గుర్తిస్తూ పద్మవిభూషణ్‌ను కేంద్రం ప్రకటించింది. ఇక రాజకీయ జీవితంలో సుదీర్ఘ సేవలు అందించినందకు గానూ వెంకయ్యనాయుడుకు అవార్డు ఇచ్చింది.

పద్మవిభూషణ్ విజేతలు..

కొణిదెల చిరంజీవి(కళ)-ఆంధ్రప్రదేశ్
ఎం. వెంకయ్య నాయుడు(ప్రజా వ్యవహారాలు)-ఆంధ్రప్రదేశ్
పద్మా సుబ్రహ్మణ్యం(కళ)- తమిళనాడు
వైజయంతిమాల బాలి(కళ)- తమిళనాడు
బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ)- బిహార్

పద్మభూషణ్‌ విజేతలు..

విజయ్‌కాంత్‌(మరణానంతరం)- తమిళనాడు
ఎం.ఫాతిమా బీవీ (మరణానంతరం)-కేరళ
హర్మస్‌జీ ఎన్‌ కామా- మహారాష్ట్ర
మిథున్‌ చక్రవర్తి- పశ్చిమ బెంగాల్‌
సీతారాం జిందాల్‌- కర్ణాటక
యోంగ్‌ లు, తైవాన్‌
అశ్విన్‌ బాలాచంద్‌ మెహతా- మహారాష్ట్ర
సత్యబ్రత ముఖర్జీ- పశ్చిమ బెంగాల్‌
రామ్‌ నాయక్‌- మహారాష్ట్ర
తేజస్‌ మధుసూదన్‌ పటేల్‌-గుజరాత్‌
ఒలిచెరి రాజగోపాల్‌- కేరళ
దత్రాత్రేయ అంబదాస్‌- మహారాష్ట్ర
తోగ్డాన్‌ రింపోచ్‌- లడఖ్‌
చంద్రేశ్వర్‌ ప్రసాద్‌ ఠాకూర్‌- బీహార్‌
ఉషా ఉతప్‌- పశ్చిమ బెంగాల్‌
కుందన్‌ వ్యాస్‌- మహారాష్ట్ర
ప్యారేలాల్‌ శర్మ- మహారాష్ట్ర

పద్మశ్రీ విజేతలు..

తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి పద్మశ్రీ అవార్డు దక్కింది. తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్రకథ వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, ఏపీకి చెందిన హరికథ కళాకారిణి డి. ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. వీరితో పాటు..

నారాయణన్‌ ఈపీ - కేరళ
భాగబత్‌ పదాన్‌ - ఒడిశా
శాంతిదేవీ పాశ్వాన్, శివన్‌ పాశ్వాన్‌ - బిహార్‌
భద్రప్పన్‌ ఎం - తమిళనాడు
జోర్డాన్‌ లేప్చా - సిక్కిం
మచిహన్‌ సాసా - మణిపూర్‌
ఓంప్రకాశ్‌ శర్మ - మధ్యప్రదేశ్‌
రతన్‌ కహార్‌ - పశ్చిమ బెంగాల్‌
సనాతన్‌ రుద్ర పాల్‌ - పశ్చిమ బెంగాల్‌
నేపాల్‌ చంద్ర సూత్రధార్‌ - పశ్చిమ బెంగాల్‌
గోపీనాథ్‌ స్వైన్‌ - ఒడిశా
అశోక్‌ కుమార్‌ బిశ్వాస్‌ - బిహార్‌
స్మృతి రేఖ ఛక్మా - త్రిపుర
జానకీలాల్‌ - రాజస్థాన్‌
బాలకృష్ణన్‌ సాధనమ్‌ పుథియ వీతిల్‌ - కేరళ
బాబూ రామ్‌యాదవ్‌ - ఉత్తర్‌ప్రదేశ్‌
దుఖు మాఝీ - పశ్చిమ బెంగాల్‌
సంగ్థాన్‌కిమా - మిజోరం
ఛామి ముర్మూ - ఝార్ఖండ్‌
గుర్విందర్‌ సింగ్‌ - హరియాణా
జగేశ్వర్‌ యాదవ్‌ - ఛత్తీస్‌గఢ్‌
సోమన్న - కర్ణాటక
పార్బతి బారువా - అస్సాం
ఉదయ్‌ విశ్వనాథ్‌ దేశ్‌పాండే - మహారాష్ట్ర
హేమచంద్‌ మాంఝీ - ఛత్తీస్‌గఢ్‌
ప్రేమ ధన్‌రాజ్‌ - కర్ణాటక
యజ్దీ మాణెక్‌ షా ఇటాలియా - గుజరాత్‌
సత్యనారాయణ బెలేరి - కేరళ
కె.చెల్లామ్మళ్‌ - అండమాన్‌ నికోబార్‌
సర్బేశ్వర్‌ బాసుమతరి - అసోం
యనుంగ్‌ జామోహ్‌ లెగో - అరుణాచల్‌ ప్రదేశ్‌

More News

Entrance Exmas: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎంసెట్ పేరు మార్పు

వివిధ కోర్సుల్లో ప్రవేశాల్లో నిర్వహించే పరీక్షల షెడ్యూలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్ పేరును 'టీఎస్ ఈఏపీసెట్(TS EAPCET)'గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

అవును.. గుంపు మేస్త్రీనే.. కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

తనను గుంపు మేస్త్రీ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అవును నేను మేస్త్రీనే.. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్మించిన మేస్త్రీనే అని కౌంటర్ ఇచ్చారు.

'భారతరత్న' పురస్కారం ఎప్పుడు ప్రారంభమైంది.. ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు..?

దేశంలో అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'. ఈ అవార్డును 1954 జనవరి 2న, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో ప్రారంభించారు. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అసాధారణ సేవలందించిన

Prof Kodandaram: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్‌

గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నియమించారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమరుల్లా ఖాన్‌ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి(Mahendar Reddy) నియామకం అయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై(Tamilisai) ఆమోదం తెలిపారు.