మెగాస్టార్ చేతుల మీదుగా విడుదలైన 'దేశంలో దొంగలు పడ్డారు' ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
అలీ సమర్పణలో ఖయూమ్, తనిష్క్ , రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన సినిమా 'దేశంలో దొంగలు పడ్డారు'. సారా క్రియేషన్స్ పతాకం పై రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ " 'దేశంలో దొంగలు పడ్డారు' ట్రైలర్ నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషం. దీనికి కారణం నా చిరకాల మిత్రుడు అలీ సోదరుడు ఖయ్యూం ఇందులో ప్రధాన పాత్ర పోషించడం చూసి నాకు ఓ గుడ్ ఇంప్రెషన్ వచ్చింది. డైరెక్టర్ గౌతమ్ ఫస్ట్‌టైమ్ డైరెక్ట్ చేస్తున్నప్పటికీ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం ఓ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నట్లుగా అనిపించింది.
ట్రైలర్ ఇంప్రెస్సీవ్ గా ఉంది. ఇందులో ఫొటోగ్రఫీ కానీ మిగతా వాల్యూస్ అన్నీ హైరేంజ్‌లో ఉన్నా సరే కంటెంట్ మాత్రం వెరీ కాంటెంపరరీ. హ్యూమన్ ట్రాఫికింగ్ అనే సమకాలిన పరిస్థితులను సబ్జెక్ట్‌గా తీసుకొని దాన్ని తెరకెక్కించడంలో గౌతమ్ సఫలీకృతుడవుతాడనే నమ్మకం కలిగింది. ఈరోజుల్లో నిరుపేదలైనటువంటి వారి పిల్లలను మోసం చేసి అన్యాయంగా, అక్రమంగా రవాణా చేయడమనేది రోజూ మనం పేపర్లలో కూడా చూస్తూ ఉన్నాం.
అలాంటి కంటెంట్‌ను సబ్జెక్టుగా తీసుకొని ఈ సినిమా చేసిన గౌతమ్ కచ్చితంగా ఒక మంచి సందేశం అందించాడని భావిస్తున్నాను. ముందుగా అలీ నాదగ్గరికి వచ్చి ఖయ్యూం నటించిన సినిమా అనగానే ఇదొక కామెడీ సినిమా అనుకున్నానుగానీ ఇది ఒక సీరియస్ సినిమా అని ట్రైలర్ చూసాక అర్థం అయ్యింది. ఇది ఖయ్యూంకు ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది.
తన కెరియర్‌కు ఇది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది. మంచి పెర్‌ఫార్మర్స్‌కు అవకాశం ఉన్నటువంటి పాత్ర ఖయ్యూంకు దొరకటమనేది నిజంగా అతని అదృష్టం. ఆ పాత్రను చూస్తున్నంతసేపూ చాలా సీరియస్‌గా అనిపించింది. అలాగే కొత్త అమ్మాయి తనిష్క కూడా పెరఫార్మర్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో నటించిందని అర్థం అవుతుంది.. ఈ సందర్భంగా యూనిట్‌కు సంబంధించిన టెక్నీషియన్ సభ్యులందరికీ, అలాగే మా ఖయ్యూం కి ఆల్ ది వెరీ బెస్ట్, గౌతమ్‌ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను" అన్నారు.
గిరిధర్, జబర్దస్త్ రాఘవ, వినోద్, తడివేలు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: శేఖర్ గంగనమోని, సంగీతం: శాండీ, ఎడిటింగ్: మధు.జి.రెడ్డి, కళ: మధు రెబ్బా, సమర్పణ: అలీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయికుమార్ పాలకూరి, సహ నిర్మాతలు: సంతోష్ డొంకాడ, సెలెబ్ కనెక్ట్ .
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments