బాలయ్య పుట్టిన రోజున చిరు ట్వీట్.. చెక్ పెట్టినట్లేనా!?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ అ్రగనటుడు కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఇవాళ్టితో ఆయన 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు వారి వారి ఇళ్లలోనే కేక్‌లు కట్ చేసి.. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం బాలయ్యకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. బాలయ్య పుట్టిన రోజున ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మా’ బాలయ్య అంటూ ఎంతో అప్యాయంగా చిరు శుభాకాంక్షలు తెలియజేయడం విశేషమని చెప్పుకోవచ్చు.
చిరు ట్వీట్ సారాంశం..
‘60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. డియర్ బాలకృష్ణ.. 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మీ అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటున్నా. హ్యాపీ బర్త్‌డే’ అని చిరు ఆసక్తికర ట్వీట్ చేశారు.
చెక్ పెట్టినట్లేనా!
కాగా.. గత కొన్నిరోజులుగా చిరు వర్సెస్ బాలయ్యగా పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. బాలయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం.. అందుకు మెగాబ్రదర్ నాగబాబు స్పందించడం ఇలా టీవీలు, దినపత్రికలు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనమే రేగింది. మరోవైపు మెగా వర్సెస్ నందమూరి అభిమానులుగా పరిస్థితులు నెలకొని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అంతేకాదు.. నాడు నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి నుంచి నిన్న మొన్నటి వరకూ కూడా బాలయ్య ఇంటర్వ్యూల వేదికగా చిరు ఇంట్లో సమావేశం.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీలపై విమర్శలు గుప్పించిన విషయం విదితమే. అయితే అవన్నీ ఏమీ పట్టించుకోని చిరు.. బాలయ్యకు బర్త్ డే విషెస్ చెప్పడంతో ఈ వివాదాలన్నింటికీ చెక్ పెట్టినట్లయ్యింది. అంతేకాదు.. ఎన్ని అనుకున్నా నటులంతా ఒక్కటే అని తన ట్వీట్ చిరు పరోక్షంగా చెప్పాడని అనుకోవచ్చు. సో.. మొత్తానికి అటు బాలయ్య.. ఇటు చిరు అభిమానులకు సంతోషాన్నిచ్చే విషయాన్ని చిరు పంచుకున్నాడన్న మాట.
60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2020
ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను.Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments