చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడంటూ ట్విట్టర్‌ని షేక్ చేసిన చిరు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. నాటి జనరేషన్ నుంచి నేటి జనరేషన్ వరకూ ఆయన్ను విపరీతంగా అభిమానిస్తారు. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ ఏమీ లేవు. చిన్న చిన్న సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ పెద్ద స్టార్స్ మాత్రం షూటింగ్‌లకు సుముఖంగా లేరు. దీంతో పెద్ద సినిమాలన్నీ షూటింగ్‌కు దూరంగానే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువలో ఉంటూ వస్తున్నారు.
తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు పోస్టు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఈరోజు ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు.. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు’ అని ట్వీట్ చేశారు. అంతే అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. మెగాస్టార్ ట్వీట్ చేసిన గంటలోపే.. దీనికి 7200 లైక్స్ రాగా.. 2 వేలకు పైగా రీట్వీట్స్.. వెల్లువలా కామెంట్స్ వచ్చాయి. మొత్తానికి ఒక్క ట్వీట్‌తో చిరు ట్విట్టర్‌ని షేక్ చేసేస్తున్నారు.
చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు...???? ... 4PM Today
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com