తెలుగుదేశం పార్టీలో చేరుతున్న మెగాస్టార్..!
- IndiaGlitz, [Thursday,October 27 2016]
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం...ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ 150వ చిత్రం ఖైదీ నెం 150 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే...చిరంజీవి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీలోకి చిరంజీవిని రప్పించేందుకు తెదేపా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నారా లోకేష్ రంగంలోకి దిగి చిరంజీవితో సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం. అయితే...పార్టీలో చేరేందుకు సిద్దమేనని, ఎలాంటి పదవులు అవసరం లేదని చిరంజీవి చెప్పారట. డిసెంబర్ 5న చిరంజీవి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయం అని ప్రచారం జరుగుతుంది. మరి... ఈ ప్రచారం పై తెలుగుదేశం కానీ, చిరంజీవి కానీ స్పందిస్తారేమో చూడాలి..!