అమితాబ్ పాత్రను పెంచే ఆలోచనలో చిరు?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల పూర్తి చేసుకున్న రెండో షెడ్యూల్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తైన వెంటనే బిగ్ బీ ముంబైకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సినిమాలో నరసింహారెడ్డి (చిరు) గురువు పాత్రలో అమితాబ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సన్నివేశాలు బాగా రావడంతో.. ఈ పాత్ర నిడివిని పెంచాలని చిరు భావిస్తున్నట్టు సమాచారం. అమితాబ్ నటించిన సీన్స్ సినిమా సెకండ్ హాఫ్‌లో వస్తాయని తెలిసింది. ఫస్ట్ హాఫ్‌లో కూడా అమితాబ్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఉంటే.. చిత్రానికి మరింత ప్లస్ అవుతుందని చిరు దర్శకుడితో చర్చించారట. ఈ విషయమై చిరు.. బిగ్ బీతో మాట్లాడడం.. దానికి ఆయన ఓకె అనడంతో.. ఇప్పుడు అమితాబ్ పాత్ర నిడివిని పెంచేందుకు చిత్ర బృందం వర్కవుట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ పాత్ర నిడివిపై ఒక క్లారిటీ రానుంది. తెలుగు, తమిళం, హిందీతోపాటు అన్ని భారతీయ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి.. అమితాబ్ పాత్రను పెంచడం వలన మరింత కలిసొస్తుందని టి-టౌన్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments