ఉక్రెయిన్ కు చిరు...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం తమిళ హిట్ చిత్రం కత్తికి రీమేక్. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాపవర్‌స్టార్ రాంచరణ్ ఈ సినిమాను నిర్మిస్తుంటే, ఠాగూర్ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరు నటిస్తున్న చిత్రమిది.
ఇప్పటికి సినిమా 70 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిరు, లక్ష్మీరాయ్‌లపై స్పెషల్‌సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ తర్వాత యూనిట్ ఉక్రెయిన్‌కు వెళుతుంది. అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ చిత్రంలో చిరు డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments