సామాన్యుడు కలల్నీ నిజం చేసేందుకు వస్తున్న మెగాస్టార్ మీలో ఎవరు కోటీశ్వరుడు..!
Friday, October 14, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సామాన్యుడు కూడా తన కలల్నీ ఆశల్నీ నిజం చేసుకునే అద్భుత అవకాశం కల్పిస్తున్న ప్రొగ్రామ్ మీలో ఎవరు కోటీశ్వరుడు. జీవితంలో ఒక అద్భుతం జరగాలని, ఆ మరుపురాని సందర్భం కోసం ఎదురు చూసిన సామాన్యులకు సింహాసనం వేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రొగ్రామ్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకుంది. ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగవ సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
అయితే...మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ టైమ్ ఓ గేమ్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుండడంతో ఈ నాలుగవ సీజన్ కు మరింత క్రేజ్ ఏర్పడింది. మాటీవీని స్టార్ టీవీ తీసుకున్న తర్వాత చేస్తున్న ఫస్ట్ బిగ్ షో ఇదే. మెగాస్టార్ చిరంజీవితో అసోసియేట్ అవడం చాలా సంతోషంగా ఉంది అని స్టార్ ఇండియా సౌత్ సి.ఇ.ఓ కెవిన్ వాజ్ తెలిపారు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రొగ్రామ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గ్రేట్ ఎక్స్ పీరియన్స్ & ఎక్సైట్ మెంట్ అందిస్తుంది. అందుచేత ఈ షోని కొత్త కొత్త ఆలోచనలతో నెక్ట్స్ లెవల్ కి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ నాలుగవ సీజన్ ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంది అని మాటీవీ బిజినెస్ హెడ్ అలోక్ జైన్ తెలియచేసారు. ఈ షోలో పాల్గొనేందుకు మాటీవీలో అడిగిన ప్రశ్నలకు ఎస్.ఎం.ఎస్ ద్వారా సమాధానం పంపి రిజిష్టర్ చేయించుకోవాలి. ఈ అవకాశం ఈనెల 11 నుంచి 18 వరకు మాత్రమే. డిసెంబర్ నుంచి చిరంజీవి హాస్ట్ గా వ్యవహరించే మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగవ సీజన్ ప్రసారం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments