చరిత్రలో నిలిచిపోయేలా మెగాస్టార్ మహా సంకల్పం.. ఇక ప్రతి జిల్లాలో..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి కోట్లాదిమందికి అభిమాన హీరో. ఎందరికో ఆదర్శంగా నిలిచిన నటుడు. ప్రస్తుతం చిరు కోవిడ్ పరిస్థితుల్లో ఆపదలో ఉన్నవారిని ఆడుకుంటూ ఆరాధ్య దైవంగా మారుతున్నారు. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా చిరంజీవి రోజు రోజుకూ తన సహాయ కార్యక్రమాలని పెంచుకుంటూ పోతున్నారు. ఖర్చుకి వెనుకాడడం లేదు.
తాజాగా చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయం చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంది. ఆయనకు సెల్యూట్ కొట్టాలనిపించేలా ఉంది. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆక్సిజన్ అందక ఎందరో పేషంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యవసరమైన వారికి ఆక్సిజన్ అందేలా ఇకపై ప్రతి జిల్లాలో చిరంజీవి ట్రస్ట్ తరుపున ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చిరంజీవి సంకల్పించుకున్నారు.
వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభం కానున్నాయి. చిరంజీవి 1998లో బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. బలమైన కారణంతోనే చిరంజీవి ఆనాడు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కలగనన్నారు. ఓ రోజు దినపత్రికలో సరైన సమయానికి రక్తం అందక పేషంట్ మృతి చెందాడనే వార్త కనిపించింది. అప్పుడే చిరంజీవి మదిలో బ్లడ్ బ్యాంక్ ఆలోచన మొదలయింది.
బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి అత్యవసరమైన వారికి రక్తం అందించగలిగితే ఎన్నో ప్రాణాలు నిలబడతాయి అని చిరంజీవి భావించారు. వెంటనే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నిర్విరామంగా సేవలు అందిస్తున్నారు. అదే తరహాలో ప్రస్తుతం సమయానికి ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు నిలబడడం లేదు.ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందని చిరంజీవి భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మెగాస్టార్ తనయుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments