చరిత్రలో నిలిచిపోయేలా మెగాస్టార్ మహా సంకల్పం.. ఇక ప్రతి జిల్లాలో..

మెగాస్టార్ చిరంజీవి కోట్లాదిమందికి అభిమాన హీరో. ఎందరికో ఆదర్శంగా నిలిచిన నటుడు. ప్రస్తుతం చిరు కోవిడ్ పరిస్థితుల్లో ఆపదలో ఉన్నవారిని ఆడుకుంటూ ఆరాధ్య దైవంగా మారుతున్నారు. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా చిరంజీవి రోజు రోజుకూ తన సహాయ కార్యక్రమాలని పెంచుకుంటూ పోతున్నారు. ఖర్చుకి వెనుకాడడం లేదు.

తాజాగా చిరంజీవి తీసుకున్న సంచలన నిర్ణయం చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంది. ఆయనకు సెల్యూట్ కొట్టాలనిపించేలా ఉంది. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆక్సిజన్ అందక ఎందరో పేషంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యవసరమైన వారికి ఆక్సిజన్ అందేలా ఇకపై ప్రతి జిల్లాలో చిరంజీవి ట్రస్ట్ తరుపున ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చిరంజీవి సంకల్పించుకున్నారు.

వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభం కానున్నాయి. చిరంజీవి 1998లో బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. బలమైన కారణంతోనే చిరంజీవి ఆనాడు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కలగనన్నారు. ఓ రోజు దినపత్రికలో సరైన సమయానికి రక్తం అందక పేషంట్ మృతి చెందాడనే వార్త కనిపించింది. అప్పుడే చిరంజీవి మదిలో బ్లడ్ బ్యాంక్ ఆలోచన మొదలయింది.

బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి అత్యవసరమైన వారికి రక్తం అందించగలిగితే ఎన్నో ప్రాణాలు నిలబడతాయి అని చిరంజీవి భావించారు. వెంటనే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నిర్విరామంగా సేవలు అందిస్తున్నారు. అదే తరహాలో ప్రస్తుతం సమయానికి ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు నిలబడడం లేదు.ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందని చిరంజీవి భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మెగాస్టార్ తనయుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది.

More News

హాట్ పిక్స్: సోనాల్ చౌహాన్.. సో సెక్సీ

ఢిల్లీ పోరి సోనాల్ చౌహాన్ కు హీరోయిన్ గా అంత సక్సెస్ ఏమీ లేదు. తెలుగులో ఆమె కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించింది.

ఏంటి.. ఆ హీరోతో 'ఉప్పెన' డైరెక్టర్ మూవీ?

ఉప్పెన విజయంతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.

మరో కుటుంబానికి ఆపద్భాంధవుడైన మెగాస్టార్

కరోనా కారణంగా  ఇటీవల కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కిలారి జయరామ్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.

నెల్లూరులో కరోనాకు ఆయుర్వేదం మందుపై అధికారుల రిపోర్ట్..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బొనిగి ఆనందయ్య ఆయుర్వేదం మందును ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నారు.

నేషనల్ అవార్డు విన్నర్, డైరెక్టర్ విశ్వేశ్వరరావు కన్నుమూత.. ఎన్టీఆర్ తో..

ప్రముఖ నిర్మాత, దర్శకుడు విశ్వేశ్వరరావు కన్నుమూశారు. కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ ఉదయం చెన్నైలో మృతి చెందారు.