మెగాస్టార్‌కు కరోనా.. రెండు రోజుల క్రితమే సీఎంను కలిసిన చిరు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని చిరు ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. నిజానికి నేటి నుంచి `ఆచార్య` సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ క్రమంలోనే చిరు షూటింగ్లో పాల్గనడానికి ముందుగా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అయితే టెస్ట్‌లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని చిరు వెల్లడించారు. గత 4-5 రోజుల్లో తనను కలిసినవారందరూ టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
``ఆచార్య` షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను` అని చిరంజీవి ట్వీట్ చేశారు. మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
రెండు రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కలిసి వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆ సమయంలో కనీసం చిరు కానీ.. నాగ్ కానీ చివరకు సీఎం కేసీఆర్ కూడా మాస్క్ ధరించి లేకపోవడం ఫోటోల్లో గమనించవచ్చు. ఈ సందర్భంగా చిరు, నాగ్లు వరద బాధితులను ఆదుకునే నిమిత్తం ప్రకటించిన విరాళాలకు సంబంధించిన చెక్కులను కేసీఆర్‌కు అందజేశారు. వీరంతా చాలా సమీపంగా మెలగడం కూడా సీఎంను కలిసిన చిత్రాల్లో చూడవచ్చు. అయితే మెగాస్టార్‌కు లక్షణాలేవీ లేకపోవడం కాస్త ఊరటనిచ్చే విషయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments