చిరు టార్గెట్ ఇప్పుడదే...

  • IndiaGlitz, [Monday,January 16 2017]

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో సంక్రాంతికి విడుద‌లైన చిత్రం 'ఖైదీ నంబ‌ర్ 150'. విడుద‌ల రోజు నుండి సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మించుతూ క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తూ ముందుకెళుతుంది.

ముఖ్యంగా ఓవ‌ర్‌సీస్‌లో చిరంజీవి త‌న సత్తా చాటుకుంటున్నాడు. తొలిరోజునే 1.2 మ‌లియ‌న్ డాలర్స్‌ను సాధించిన ఖైదీ నంబ‌ర్ 150 చిత్రం ఆదివారం ముగిసే స‌రికి రెండు మిలియ‌న్స్‌ను దాటేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో ఓవ‌ర్‌సీస్ క‌లెక్ష‌న్స్ 2.2 మిలియ‌న్స్‌, నితిన్ అఆ చిత్రాలు 2.4 మిలియ‌న్స్ టార్గెట్ అయ్యింది. ఈ రెండు సినిమాల టోట‌ల్ ర‌న్‌ను దాటేయ‌డం ఖైదీ నంబ‌ర్ 150కు పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

శాతకర్ణితో మాకు శుభారంభం: డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్

రోజురోజుకూ "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రానికి ఆదరణతోపాటు థియేటర్ల ముందు టికెట్ల కోసం క్యూలు పెరుగుతుండడంతో మా డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు నిజమైన సంక్రాంతి అంటే ఇదేనేమో అనిపిస్తుంది.

మలయాళ దర్శకుడితో నాగార్జున...

విలక్షణ పాత్రలు చేయడానికి ప్రాముఖ్యతనిచ్చే హీరో అక్కినేని నాగార్జున తర్వలోనే నాలుగు భాషల్లో రూపొందనున్న ఓ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్నాడు.

ఓవర్ సీస్ లో విశేషంగా ఆకట్టుకుంటున్న శతమానం భవతి..!

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ శతమానం భవతి. ఈ చిత్రాన్ని వేగేశ్న సతీష్ తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

జనవరి 20న లారెన్స్ 'శివలింగ' ఆడియో విడుదల

కొరియోగ్రాపర్, డైరెక్టర్, హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై శివలింగ ను తెరకెక్కిస్తున్న చిత్రం 'శివలింగ'.రితిక హీరోయిన్గా నటిస్తుంది.

1 మిలియన్ మార్క్ ను అందుకుంటున్న శాతకర్ణి..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. జాగర్లమూడి క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించారు.