చిరు టార్గెట్ ఇప్పుడదే...

  • IndiaGlitz, [Monday,January 16 2017]

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో సంక్రాంతికి విడుద‌లైన చిత్రం 'ఖైదీ నంబ‌ర్ 150'. విడుద‌ల రోజు నుండి సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మించుతూ క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తూ ముందుకెళుతుంది.

ముఖ్యంగా ఓవ‌ర్‌సీస్‌లో చిరంజీవి త‌న సత్తా చాటుకుంటున్నాడు. తొలిరోజునే 1.2 మ‌లియ‌న్ డాలర్స్‌ను సాధించిన ఖైదీ నంబ‌ర్ 150 చిత్రం ఆదివారం ముగిసే స‌రికి రెండు మిలియ‌న్స్‌ను దాటేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో ఓవ‌ర్‌సీస్ క‌లెక్ష‌న్స్ 2.2 మిలియ‌న్స్‌, నితిన్ అఆ చిత్రాలు 2.4 మిలియ‌న్స్ టార్గెట్ అయ్యింది. ఈ రెండు సినిమాల టోట‌ల్ ర‌న్‌ను దాటేయ‌డం ఖైదీ నంబ‌ర్ 150కు పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.