ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి, తారక్, బన్ని
Send us your feedback to audioarticles@vaarta.com
2019 అసెంబ్లీ, పార్లమెంట్(లోక్‌సభ) స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో 17లో లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో సినీ సెలబ్రిటీలు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సినీ నటుడు చిరంజీవి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్, సురేఖ, ఉపాసనలు జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు వేశారు.
తారక్, బన్ని జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్‌లో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా `ఓటు చాలా విలువైంది. ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఎవరూ సమయాన్ని వృథా చేసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి` అని ఈ సందర్భంగా బన్ని తెలిపారు.
తల్లి షాలిని, భార్య లక్ష్మి ప్రణతి సహా తారక్ జూబ్లీ హిల్స్ పోలింగ్ బూతుకు వచ్చి ఓటేశారు. అందరూ ఓటేయాలని పిలుపునిచ్చారు. `మాకు ఇంక్ పడింది.. మరి మీకు పడిందా?` అని అడుగుతూ తారక్ తన ఇన్‌స్టాలో ఓ ఫోటోను కూడా జత చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout