ఓటు హ‌క్కు వినియోగించుకున్న చిరంజీవి, తార‌క్‌, బ‌న్ని

  • IndiaGlitz, [Thursday,April 11 2019]

2019 అసెంబ్లీ, పార్ల‌మెంట్(లోక్‌స‌భ‌) స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. తెలంగాణ‌లో 17లో లోక్‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్‌లో సినీ సెల‌బ్రిటీలు వారి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

సినీ నటుడు చిరంజీవి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్‌, సురేఖ, ఉపాసనలు జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు వేశారు.

తార‌క్‌, బ‌న్ని జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్‌లో వారి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్భంగా 'ఓటు చాలా విలువైంది. ఓటు వేస్తేనే ప్ర‌శ్నించే హ‌క్కు ఉంటుంది. ఎవ‌రూ స‌మ‌యాన్ని వృథా చేసుకోకుండా ఓటు హ‌క్కును వినియోగించుకోవాలి' అని ఈ సంద‌ర్భంగా బ‌న్ని తెలిపారు. 

త‌ల్లి షాలిని, భార్య ల‌క్ష్మి ప్ర‌ణ‌తి స‌హా తార‌క్ జూబ్లీ హిల్స్ పోలింగ్ బూతుకు వ‌చ్చి ఓటేశారు. అంద‌రూ ఓటేయాల‌ని పిలుపునిచ్చారు. 'మాకు ఇంక్ ప‌డింది.. మ‌రి మీకు ప‌డిందా?' అని అడుగుతూ తార‌క్ త‌న ఇన్‌స్టాలో ఓ ఫోటోను కూడా జ‌త చేశారు. 

More News

ఈవీఎంల మొరాయింపు పై సీఎం అసంతృప్తి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో ఈసీ తీరుపై మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. ప్రతిపక్షానికి ఈసీ సపోర్ట్ చేస్తుందని అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

'RRR' లో నిత్యామీన‌న్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందుతోన్న చిత్రం `RRR`.

మోది బయోపిక్‌కి బ్రేక్‌ 

భారత ప్రధాని నరేంద్రమోది బయోపిక్‌ 'పిఎం నరేంద్రమోది' బయోపిక్‌ విడుదలకి ఎన్నికల కమీషన్‌ అభ్యంతరం తెలియజేసింది. ఎన్నికలు అయ్యే వరకు సినిమా విడుదలను ఆపాల్సిందేనంటూ తేల్చేసింది

'లక్ష్మీస్ ఎన్టీఆర్' మళ్ళీ వాయిదా

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభం నుంచి.... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కు ముచ్చెమటలు పట్టించిన డైరెక్టర్ వర్మ....

లక్‌ మారుతుందా?

తెలుగులో 'లై' చిత్రంతో నితిన్‌తో జత కట్టిన మేఘా ఆకాశ్‌ తదుపరి సినిమా 'ఛల్‌మోహన్‌రంగ'లో కూడా నితిన్‌తో రొమాన్స్‌ చేసింది.