మహిళా పోలీస్ ఆఫీసర్‌తో చిరు సంభాషణ
Send us your feedback to audioarticles@vaarta.com
వరల్డ్ మదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రపంచంలోని అమ్మలకు అభినందనలు తెలియచేసిన సంగతి తెలిసిందే. అదే రోజున ఓ మహిళా ఆఫీసర్ మరో మహిళకు అన్నం తినిపిస్తున్న వీడియోను పోస్ట్ చేసి ఆమెతో తాను మాట్లాడానని ఆ వీడియోను తాను పోస్ట్ చేస్తానని తెలిపారు. చెప్పినట్లుగానే భువనేశ్వర్‌కు చెందిన మహిళా పోలీస్ ఆఫీసర్ శుభశ్రీతో తాను మాట్లాడిన వీడియోను చిరంజీవి ట్వీట్ చేశారు.
చిరంజీవి: గుడ్ మార్నింగ్ శుభశ్రీజీ
శుభశ్రీ: నమస్తే సార్
చిరంజీవి: నమస్తే అమ్మ.. రెండు రోజుల క్రితం నేను మీకు సంబంధించిన ఓ వీడియో చూశాను. అందులో మీరు మతిస్థిమితం లేని వ్యక్తికి అన్నం తినిపించడాన్ని చూశాను. ఆరోజు నుండి మీతో మాట్లాడటానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. మీరు సదరు వ్యక్తి పట్ల అంత మానవీయంగా ఉండటం చూసి చాలా సంతోషంగా అనిపించింది. మీరలా స్పందిచడానికి కారణమేంటి?
శుభశ్రీ: నేను సదరు మహిళకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఆ పరిస్థితుల్లో ఆమె చేతులతో ఆహారం తీసుకునే స్థితిలో లేదు. ఆమెకు మానసిక సమస్యే కాదు.. శారీరక సమస్యతో ఇబ్బంది పడుతుంది.
చిరంజీవి: నేను మీలో ఓ తల్లి హృదయం చూశాను.
శుభశ్రీ: ధన్యవాదాలు సార్
చిరంజీవి: మీరు చాలా మందికి స్ఫూర్తినిచ్చారు. మీకు చాలా అభినందనలు అందే ఉంటాయిగా?
శుభశ్రీ: అవును సర్.. మా గౌరవ ముఖ్యమంత్రిగారు దీని గురించి ట్వీట్ చేశారు. అలాగే మా ఏడీజీపీ అరుణ్ సలోంజిగారు బాధ్యతను నిర్వర్తించడం అంటే లా అండ్ ఆర్డర్ ఒకటే కాదు. పౌరులకు ఏ అవసరం వచ్చినా మనం సాయపడాలని. దీన్ని నేనొక రివార్డ్‌గా భావిస్తాను. నేను ఎంతో ఉద్వేగంతో ఉన్నాను. ఆనంద్‌గారు మీరు నాతో మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పగా.. ఎంతో ఉత్తేజితమైయాను. మీరొక మెగాస్టార్ మాత్రమే కాదు. గొప్ప సామాజిక సేవకులు. మీరు చేసిన ఎన్నో కార్యక్రమాలు, సెమినార్లు చూడటం జరిగింది. అలాగే టూరిజం గురించి మీరు చేసిన అభివృద్ది గురించి నాకు తెలుసు. నేను మీకొక గొప్ప అభిమానిని. మీ వ్యక్తిత్వం ఎంతో ఇష్టం. ఎంతో సంతోషాన్నిచ్చింది.
చిరంజీవి: థాంక్యూ అమ్మ..మీరు ఇలాగే ఇంకా గొప్ప కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను.
So delighted to chat with #Shubhasri ji ,the Odisha Cop who cares for citizens like her own.Salute her compassion. @CMO_Odisha @Naveen_Odisha @DGPOdisha pic.twitter.com/15ZURVUITc
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 12, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments