Chiranjeevi:అలాంటి రియల్ హీరోలకు సెల్యూట్.. 'ఆపరేషన్ వాలంటైన్' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా పుల్వామా ఘటన నేపథ్యంలో శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’(Operation Valentine). ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. మార్చి 1న ఈ సినిమాల ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందారని... అది గుర్తొచ్చినప్పుడల్లా మనసు హృదయవిదారకరంగా ఉంటుందని వాపోయారు. ఆ జవాన్ల మరణానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు మన భారత వైమానిక దళం చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తీశారని తెలిపారు. కచ్చితంగా ఇలాంటి చిత్రాలు గొప్పగా ఆడాలని కోరారు. ఈ తరహా సినిమాలు చూస్తున్నప్పుడు దేశభక్తి ఉప్పొంగుతుందన్నారు. ముఖ్యంగా యువతరం ఇలాంటి సినిమాల పట్ల బాధ్యతగా ఉండాలన్నారు. మన దేశ సైనికులు చలిలోనూ.. మండే ఎండల్లోనూ.. ఎడారుల్లోనూ నిద్రహారాలు మాని, ఎలా కాపలా కాస్తున్నారో ప్రతి ఒక్కరూ చూడాలని.. అలాంటి రియల్ హీరోలకు ఓ సెల్యూట్ చేయాలని తెలిపారు.
ఈ సినిమాని తక్కువ బడ్జెట్‌లో.. 75రోజుల్లోనే ఎంతో నాణ్యతతో తెరకెక్కించారన్నారు. ట్రైలర్‌లో కనిపించిన విమానాలు.. విజువల్స్ చూస్తుంటే ఇంత తక్కువ బడ్జెట్‌లో అంత గొప్ప నాణ్యమైన సినిమా తీశారా అని ఆశ్చర్యం కలుగుతోందని చెప్పుకొచ్చారు. డబ్బు ఖర్చు పెడితేనే రిచ్‌నెస్ రాదని.. అది మన ఆలోచనల్లో ఉండాలన్నారు. సినిమా అనుకున్న బడ్జెట్‌లో బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడం, తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి నిర్మాతలకు సపోర్ట్‌గా ఉండటం ఈ మూవీ డైరెక్టర్ శక్తి నుంచి నేర్చుకోవాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని పిలుపునిచ్చారు.
ఇక వరుణ్ తేజ్ మాట్లాడుతూ ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతోనే తానెప్పుడూ కష్టపడుతుంటానన్నారు. ఈ చిత్రాన్ని మన దేశ వైమానిక దళ వీరుల త్యాగాల్ని, గొప్పతనాన్ని చాటేలా ఎంతో చక్కగా డైరెక్టర్ తెరకెక్కించారని తెలిపారు. ఈ సినిమా చూసి ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగు వాడు గుండెలపై చేయి వేసుకొని మన జవాన్లకు సెల్యూట్ కొడతారని పేర్కొన్నారు. తప్పకుండా అందరూ థియేటర్‌కు వెళ్లి చూడండని వరుణ్ కోరారు.
అలాగే నాగబాబు మాట్లాడుతూ వరుణ్ ఎప్పుడూ కొత్తదనంతో నిండిన సినిమాలు చేయాలనుకుంటాడని.. అందుకే రిస్క్ తీసుకుంటాడన్నారు. ఈ క్రమంలో చాలా సార్లు ఫెయిలయ్యాడన్నారు. కానీ వరుణ్ ఎంపిక చేసుకునే కథలు, పాత్రలు నాకు బాగా ఇష్టమన్నారు. కొడుకు విజయం అందుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో పరాజయం పొందినప్పుడు అంతే బాధ ఉంటుందన్నారు. నా బాధ తనకు, తన బాధ నాకు తెలుసు అన్నారు. జయాపజయాలకు అతీతంగా తను ముందుకెళ్లాలని కోరుకుంటున్నానని.. ఒక్కోసారి మంచి ప్రయత్నాలు కూడా ఫెయిల్ అవుతాయని చెప్పారు. అక్కడే ఆగిపోకుండా ప్రయత్నాలు చేస్తూ వెళ్తుంటే ఎవరైనా జీవితంలో సక్సెస్ అవుతారన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com