'మహానటి'ని చూస్తుంటే నా గుండె బరువెక్కింది..కళ్లు చెమర్చాయి: మెగాస్టార్ చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రియాంకదత్త్, స్వప్న దత్త్ నిర్మించిన 'మహానటి' ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ చిత్ర దర్శక, నిర్మాతల్ని శనివారం ఉదయం ఆయన ఇంట్లో సన్మానించారు.
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ, "నా అభిమాన నటి సావిత్రి గారు. నేను మొదటిసారి కెమెరా ముందు నిలబడింది 'పునాది రాళ్లు'. అందులో ఆమె హీరో తల్లిగా నటించారు. హీరో స్నేహితుల పాత్రల్లో నాది ఒకటి. ఆ సినిమాలో రెండు మూడు సీన్లు సావిత్రి గారితో పనిచేసే అవకాశం నా అదృష్టంగా భావిస్తున్నా.
చిన్న వయసు నుంచి ఆమెకు వీరాభిమానిని. ఆ విషయాలు ఆమెతో చెప్పగానే నా గురించి అడిగి భవిష్యత్ లో పెద్దస్టార్ అవ్వాలని దీవించారు. అది అద్భుతమైన సంఘటన. అలాంటి మహానటిపై నా నిర్మాత దత్ గారు బయోపిక్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నాగ్ అశ్విన్ యంగ్ డైరెక్టర్. తన తొలి సినిమా బాగుంది. కానీ తన అనుభవంతో ఈ సినిమా ఎలా చేయగలడని మీమాంస నాలో ఉంది. ఎంతవరకూ దీనికి న్యాయం చేయగలడని సందేహాలుండేవి. కానీ సినిమా చూసిన తర్వాత నా అనుమానాలు పటాపంచల్ అయిపోయాయి.
సినిమా చూస్తున్నంత సేపు హృదయం బరువెక్కింది. కళ్లు చెమర్చాయి. అద్భుతంగా చేసి నాగ్ అశ్విన్ శెభాష్ అనిపించాడు. కథ పై ఎంత రీసెర్చ్ చేశాడో సినిమా చూస్తే అర్ధమవుతుంది. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని, కీర్తిని పెంచినవాడు అయ్యాడు. జాతీయ, అంతర్జాతీయంగా తెలుగు పరిశ్రమ మరో పెక్కి ఎక్కింది. ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి కథలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. సావిత్రి గారు ఎంత అందంగా ఉన్నారు? ఆమె చిన్నప్పటి బాల్యం? స‌్టార్ అయిన తర్వాత ఆమె పరిస్థితులు? తర్వాత ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కున్నారు? అనేది అద్భుతంగా చూపించారు. అది దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. సినిమా ప్రారంభం నుంచి ఎండిగ్ వరకూ చాలా అందంగా..అద్భుతంగా చూపించారు.
సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించడం అనడం కంటే జీవించింది అనడం కరెక్ట్. సినిమా లోకి వెళ్లే కొద్ది సావిత్రిని చూస్తున్నట్లు అనిపించి. దుల్కార్ సల్మాన్ జెమిని గణేష్ గారిలానే అద్భుతంగా నటించారు. ఆయనతో కలిసి రుద్రవీణ చేసాను. ఇలా ప్రతీది ఈ సినిమా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఈసినిమాకు బాగా కనెక్ట్ అయ్యాను. సినిమా చూసి ఎంతో సంతృప్తి చెందాను.
మోహన్ బాబు, సమంత, విజయ దేవరకొండ, నాగచైతన్య చిన్న చిన్న పాత్రలు చేసారంటే...చిరస్థాయిగా ఉంటుందని చేసారు. సావిత్రి గారికి వాళ్లు ఇచ్చిన ఘన నివాళి ఇది. అశ్వినీదత్ గారు బాస్ మీతో? రామారావుగారితో నేను ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాను. కమర్శియల్ గా హిట్ అయ్యాయి. కానీ పూర్ణోదయ సంస్థలాంటి చేసిన అవార్డు సినిమాలు చేయలేనని చాలా సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసేవారు.
కానీ 'మహానటి' సినిమా ద్వారా కుమార్తెలు దత్ కు అద్భుతమైన గిప్ట్ ఇచ్చారు. తండ్రికి ఇంత సక్సెస్ ఇచ్చి కొడుకు లేని లోటును తీర్చారు. ఈ సినిమాకు రివార్డులే కాదు..అవార్డులు కూడా వస్తాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు రావాలి. మే 9న నా 'జగదీకవీరుడు అతిలోక సుందరి' సినిమా రిలీజైంది.
అదే రోజున 'మహానటి' కూడా రిలీజైంది. అనుకోకుండా జరిగిందో...కావాలని అలా ప్లాన్ చేసారో? తెలియదు గానీ! చాలా సంతోషంగా ఉంది. అందుకు మహానటి టీమ్ అందర్నీ అభినందిస్తున్నా" అని అన్నారు.
ఈ సమావేశంలో అశ్వినీ దత్త్, నాగ్ అశ్విన్, స్వప్న దత్త్, ప్రియాంకదత్త్ పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com