మెగాస్టార్ ఠాగూర్ కి 14 ఏళ్లు
- IndiaGlitz, [Sunday,September 24 2017]
ఇంద్ర వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన చిత్రం ఠాగూర్. బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ఈ చిత్రం లంచం పై పోరాటం చేసిన ఓ సామాన్యుడి కథగా తెరకెక్కింది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. తమిళంలో ఘనవిజయం సాధించిన రమణ (మురుగదాస్ దర్శకుడు) ఆధారంగా తెలుగులో నిర్మితమైంది.
చిరంజీవి నటన.. శ్రియ, జ్యోతిక గ్లామర్.. మణిశర్మ సంగీతం.. వి.వి.వినాయక్ దర్శకత్వ ప్రతిభ.. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఇందులోని నేను సైతం గీతానికి గానూ ఉత్తమ గీత రచయితగా సుద్దాల అశోక్ తేజకి నేషనల్ అవార్డ్ దక్కింది. 253 కేంద్రాల్లో 50 రోజులు, 191 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైందీ చిత్రం. 2003లో సెప్టెంబర్ 24న విడుదలైన ఠాగూర్.. నేటితో 14 ఏళ్లను పూర్తిచేసుకుంటోంది.