విజయ్‌కు మెగా సపోర్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఫేక్ న్యూస్ రాస్తున్న కొన్ని వెబ్‌సైట్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ హీరో విజయ్ దేవరకొండ ఓ వెబ్సైట్ వ్యవహార శైలిపై దయ్యపట్టారు. మహేశ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనీల్ రావిపూడి, అనీల్ సుంకర తదితరులు విజయ్ దేవరకొండకు సపోర్ట్ నిలిచారు. అయితే ఈ వ్యవహారంపై మెగా ఫ్యామిలీ హీరోలు సైలెంట్‌గా ఉన్నారేంటి? అని అందరూ అనుకున్నారు. అయితే ఉదయానికంతా మెగాస్టార్ చిరంజీవి విజయ్ దేవరకొండకు ట్విట్టర్ ద్వారా తన సపోర్ట్‌ను అందించారు. ‘‘డియర్ విజయ్ నీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. బాధ్యత లేని రాతల కారణంగా నేనూ,నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి’’ అంటూనే అభిప్రాయాలను వార్తలుగా మలచవద్దని జరలిస్టులకు హితవు పలికారు.
నిర్మాతల గిల్డ్ కూడా విజయ్‌కు సపోర్ట్ నిలిచింది. అదే సమయంలో మరో అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున సైతం విజయ్‌కు సపోర్ట్‌ను అందించారు. కొలీగ్ విజయ్‌కు అండగా నిలబడిన చిరంజీవి ధన్యవాదాలు చెబుతూనే ఇతర హీరోలైన మహేశ్, రవితేజ సహా అందరికీ నాగ్ ధన్యవాదాలు చెప్పారు. ఈ వ్యవహారం మనం అందరం ఆలోచించాలని, అంతే కాకుండా నైతికంగా సపోర్ట్ చేయడమే కాకుండా సరైన యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేయాలని నాగార్జున కోరారు. ఈ వ్యవహారంపై తర్వలోనే హీరోలందరూ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి.
డియర్ విజయ్@TheDeverakonda మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.We stand by you. Pl don't let anything deter ur spirit to do good.Humbly request Journo friends not to peddle individual views as news.#KillFakeNews
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 5, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments