చిరంజీవిగారు లేకపోతే ఆత్యహత్య చేసుకునేవాడిని: పృథ్వీ
Send us your feedback to audioarticles@vaarta.com
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసిన కమెడియన్ పృథ్వీ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్‌వీబీసీ చైర్మన్ అయ్యారు. అయితే ఓ మహిళలతో ఆయన అసభ్యంగా మాట్లాడాడంటూ ఆడియో టేపులు బయటకు రావడంతో ఆయన పదవీ పోయింది. ఈ విషయంపై ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘నేను పార్టీకి విధేయుడైన కార్యకర్తని. అందుకే ఆరోపణలు రాగానే నా పదవికి రాజీనామా చేశాను. నాకు పార్టీపై చాలా నమ్మకం ఉంది. నాకు ఆ పదవి దక్కడం కొందరికి నచ్చలేదు. నేను విధిగా నడుచుకోవడం నచ్చని కొందరు నాపై కుట్ర చేసి నన్ను ఆ తప్పులో ఇరికించారు. పీఏ, పి.ఆర్.ఒ లను నమ్ముకుని మోసపోయాను. నన్ను కుట్ర చేసి బయటకు పంపారు. ఆయతే నాపై ఆకారణంగా కుట్ర చేసిన వాళ్లెవరూ ఈరోజు బతికి లేరు. నా జాతకమే అంత’’ అన్నారు.
ఇప్పుడు సినిమాల్లో కూడా అవకాశాలు పోయాయి కదా! అని అడిగితే.. ఇండస్ట్రీలో చిరంజీవి చాలా గొప్ప వ్యక్తి అని, నాపై ఆరోపణలు వచ్చినప్పుడు మానసికంగా బాధపడుతున్నానని చెప్పడమే కాకుండా నాకు అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేయమని కూడా చెప్పారు పృథ్వీ. ఆయన లేకపోతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేవాడినని కూడా పృథ్వీ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments