బాల‌య్య సినిమాకు చిరు స‌పోర్ట్‌....

  • IndiaGlitz, [Monday,July 18 2016]

నంద‌మూరి బాల‌కృష్ణ 'ఆదిత్య 369' చిత్రం విడుద‌లై స‌రిగ్గా పాతికేళ్లైంది. విడుద‌లైన‌ప్పుడు సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఈ చిత్రం గురించి అప్పుడు అంద‌రూ గొప్ప‌గా మాట్లాడారు. అడ్వాన్స్డ్ టెక్నాల‌జీతో ఉందంటూ, ఇలాంటి డిఫ‌రెంట్ సినిమాను చేసినందుకు నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌ను అంద‌రూ అభినందించారు. ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత సినిమాను చిన్న‌పిల్లల్లోకి తీసుకెళ్ళాల‌నే ఉద్దేశంతో నిర్మాత కృష్ణ‌ప్ర‌సాద్ చిరంజీవిని కలిసి చిన్న‌పిల్ల‌ల‌పై ఓ యాడ్ ఇవ్వ‌మ‌ని అడిగాడ‌ట‌.

ఆదిత్య 369 వంటి సినిమాను చేసినందుకు నిర్మాత‌ను మెచ్చుకున్న మెగాస్టార్ ముప్పై సెకండ్ల యాడ్స్‌ను ఏకంగా ఒక‌టి కాదు, రెండింటిలో యాడ్ చేశాడ‌ట‌. టైమ్ మిష‌న్‌లో ఎక్కితే మీరు అద్భుత‌మైన లోకాల‌ను చూడ‌వ‌చ్చు.. చూస్తారు క‌దూ అంటూ చిరంజీవి చేసిన యాడ్స్ అప్ప‌ట్లో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సార‌మ‌య్యాయి. సినిమా వంద‌రోజుల వేడుక‌కు తాను వ‌స్తాన‌న్న‌ప్ప‌టికీ షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉండటంతో శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశాడ‌ట చిరు. అలాగే ఈ సినిమా కోసం విజ‌య‌శాంతి కూడా యాడ్స్ ఇచ్చింద‌ని నిర్మాత ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

More News

మెగా హీరో మూవీ టైటిల్ జ‌వాన్..

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన సుప్రీమ్ స‌క్సెస్ సాధించ‌డంతో...త‌దుప‌రి చిత్రాలకు ప‌క్కా ప్లాన్ రెడీ చేసాడు. తేజు న‌టించిన త‌దుప‌రి చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్నిఓమ్ ఫేమ్  సునీల్ రెడ్డి తెర‌కెక్కించారు.

ఆదిత్య 369 సీక్వెల్ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..

నంద‌మూరి బాల‌కృష్ణ - సింగీతం శ్రీనివాస‌రావు కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఆదిత్య 369. విభిన్న క‌థాంశంతో రూపొందిన‌ ఆదిత్య 369 ప్రేక్ష‌కాభిమానులు ఆక‌ట్టుకుని తెలుగు నాట మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచింది.

ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత మ‌ళ్ళీ విల‌న్‌గానే

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ 2005లో వ‌చ్చిన జై చిరంజీవ సినిమాలో విల‌న్‌గా న‌టించాడు. త‌ర్వాత మ‌ళ్ళీ టాలీవుడ్‌లో నటించ‌లేదు.

2016 నాకు బాగా క‌లిసి వ‌చ్చింది - నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌

బాల‌కృష్ణ, మోహిని జంట‌గా సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం `ఆదిత్య 369`. ఈ సినిమా 1991జూలై 18న విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా టైమ్ మిష‌న్‌పై వ‌చ్చిన సినిమాగా అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

లోగో విడుద‌ల చేసిన ద‌ర్శ‌కేంద్రుడు

`సోగ్గాడే చిన్ని నాయనా`, `ఊపిరి` చిత్రాలు త‌ర్వాత నాగార్జున మ‌రోసారి డిఫ‌రెంట్‌గా భ‌క్తిర‌స‌న ప్ర‌ధాన చిత్రం `ఓం న‌మో వెంక‌టేశాయ` చిత్రంలో న‌టిస్తున్నాడు.