బాలయ్య సినిమాకు చిరు సపోర్ట్....
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ `ఆదిత్య 369` చిత్రం విడుదలై సరిగ్గా పాతికేళ్లైంది. విడుదలైనప్పుడు సెన్సేషనల్ హిట్ సాధించిన ఈ చిత్రం గురించి అప్పుడు అందరూ గొప్పగా మాట్లాడారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉందంటూ, ఇలాంటి డిఫరెంట్ సినిమాను చేసినందుకు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ను అందరూ అభినందించారు. ఈ సినిమా విడుదల తర్వాత సినిమాను చిన్నపిల్లల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నిర్మాత కృష్ణప్రసాద్ చిరంజీవిని కలిసి చిన్నపిల్లలపై ఓ యాడ్ ఇవ్వమని అడిగాడట.
ఆదిత్య 369 వంటి సినిమాను చేసినందుకు నిర్మాతను మెచ్చుకున్న మెగాస్టార్ ముప్పై సెకండ్ల యాడ్స్‌ను ఏకంగా ఒకటి కాదు, రెండింటిలో యాడ్ చేశాడట. టైమ్ మిషన్‌లో ఎక్కితే మీరు అద్భుతమైన లోకాలను చూడవచ్చు.. చూస్తారు కదూ అంటూ చిరంజీవి చేసిన యాడ్స్ అప్పట్లో దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి. సినిమా వందరోజుల వేడుకకు తాను వస్తానన్నప్పటికీ షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉండటంతో శుభాకాంక్షలను తెలియజేశాడట చిరు. అలాగే ఈ సినిమా కోసం విజయశాంతి కూడా యాడ్స్ ఇచ్చిందని నిర్మాత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com