పొలిటికల్ ఎంట్రీపై రజనీ, కమల్‌లకు చిరు సలహా
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో నెంబర్ స్టార్‌గా రాణించిన మెగాస్టార్ చిరంజీవి తన మిత్రులైన రజనీకాంత్, కమల్హాసన్లను రాజకీయాల్లోకి రావద్దు అంటూ సూచన చేశారు. ఇటీవల సైరా నరసింహారెడ్డి ప్రమోషన్స్‌లో భాగంగా కోలీవుడ్‌కి చెందిన ఆనంద వికటన్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను చర్చించారు. ప్రస్తుత రాజకీయాలు డబ్బుతో నిండిపోయాయని ఆయన తెలిపారు. నిజాయతీగా ప్రజలకు ఏమైనా చేయాలనుకున్న ఏమీ చేయలేరంటూ తనకు ఎదురైన రాజకీయ అనుభవాలను ఆయన చెప్పుకొచ్చారు. నెంబర్‌వన్ స్టార్‌గా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను. కానీ సొంత నియోజక వర్గంలో ఓడిపోయానని, ప్రత్యర్థలు కోట్లు కుమ్మరించి తనను ఓడించారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే తన సోదరుడు పవన్ కల్యాణ్‌కు కూడా జరిగిందని తెలిపారు.
ఇప్పటికే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కమల్ హాసన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధిస్తారని అనుకున్నానని, కానీ అలా జరగలేదని తెలిపారు. రజనీకాంత్, కమల్ నాతరహా వ్యక్తులు కాకపోయినా వారిద్దరినీ రాజకీయాల్లోకి రావద్దనే సలహా ఇస్తానన్నారు చిరంజీవి. అయితే ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా కూడా ప్రజలకు మంచి చేయాలనుకునేవారు రాజకీయాల్లోకి రావచ్చునని తెలిపారు.
మక్కల్ నీదిమయ్యం పార్టీతో ఇప్పటికే కమల్‌హాసన్ రాజకీయ రంగప్రవేశం చేయగా, త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout