పవన్‌కు పొలిటికల్‌గా చిరు సలహాలిచ్చారా?
Send us your feedback to audioarticles@vaarta.com
అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత తమ్ముడు పవన్‌కల్యాణ్ జనసేన పార్టీని స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పవన్ రాజకీయ పార్టీ పెట్టేటప్పుడు మీరేమైనా సలహా ఇచ్చారా? అని చిరంజీవి ప్రశ్నిస్తే... ‘‘నేను పార్టీని పెట్టి నేను నమ్మినవాళ్లు, చేరదీసినవాళ్లు నన్ను దెబ్బ తీశారని పవన్ నమ్మారు. ఆ ఎదురు దెబ్బల నుండి నేర్చుకుని తను ముందుకెళుతున్నాడు. మాది దారులు వేరు కానీ.. గమ్యం ఒకటే. అలాంటి పవన్ దారిలోకి నేను వెళ్లి ఏమని సలహా ఇవ్వగలను. అందుకే నేను తనకు సలహాలు ఇవ్వడం లేదు. తను ఇక్కడకు వచ్చినప్పుడు ఇంటికి వస్తాడు. అమ్మను కలిసి మాట్లాడుతాడు. మా ఆవిడ వంటను తను ఇష్టంగా తింటాడు. తను ఇంటికి వచ్చినప్పుడు రాజకీయాల గురించి అసలు మాట్లాడుకోం’’ అన్నారు చిరంజీవి.
మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటే.. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో నటిస్తున్నారు. రాజకీయాల్లో వచ్చిన గ్యాప్‌లో వరసు సినిమాల్లో నటిస్తున్నారు పవన్. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్‌సాబ్ ’ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout