షూటింగ్ మొదలెట్టేసిన చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూ వచ్చాయి. ఎట్టకేలకు సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం నుండి ప్రారంభమైంది. కోకాపేటలో వేసిన భారీ సెట్లో సినిమాను చిత్రీకరణ షురూ అయ్యింది. దేవదాయ శాఖ అధికారిగా చిరంజీవి నటిస్తోన్న ఈ చిత్రంలో ఆయన రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనపడబోతున్నారు. సినిమాలో కీలక పాత్ర ఉందని ఆ పాత్రలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించే అవకాశాలున్నాయని టాక్. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేసేలా ప్లాన్ జరుగుతుందట.
కొణిదెల ప్రొడక్షన్లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నట్టు సమాచారం. త్రిషను హీరోయిన్గా ఓకే చేశారని చెబుతున్నారు. అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈమె చిరుతో కలిసి గతంలో స్టాలిన్ సినిమా చేసింది ఈ అమ్మడు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి చిరంజీవితో కలిసి తెరను పంచుకోనుంది. కమర్షియల్ అంశాలున్న మెసేజ్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన కొరటాల మెగాస్టార్‌ను ఎలా చూపించబోతున్నారోనని అందరిలో ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com