చిరు సాంగ్ మాత్రం అప్పుడేనట...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు కెళుతున్నాడు. పిల్లానువ్వు లేనిజీవితం` తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రమణ్యం ఫర్ సేల్` చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా తుది దశకు చేరుకుంది.
ఈ చిత్రంలో మావయ్య చిరంజీవి ఖైదీ నెం 786`లోని గువ్వా గోరింకతో..సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారని టాక్. మిక్కి జె.మేయర్ ఈ పాటను సరికొత్తగా రీమిక్స్ చేశాడని యూనిట్ వర్గాలు చెప్పాయి. ఈ సినిమా ఆడియో ఆగస్ట్ 23న విడుదలవుతోంది. అయితే ఈ ఆడియోలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ ఉండదట. ఆ పాటను స్పెషల్ సెప్టెంబర్ 24న విడుదలయ్యే సినిమాలో మాత్రమే కనపడుతుందట. సో..ఓ రకంగా చెప్పాలంటే మెగా అభిమానులకు అప్పటి వరకు నిరాశ తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments