చిరు సాంగ్ మాత్రం అప్పుడేనట...

  • IndiaGlitz, [Wednesday,August 19 2015]

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు కెళుతున్నాడు. పిల్లానువ్వు లేనిజీవితం' తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా తుది దశకు చేరుకుంది.

ఈ చిత్రంలో మావయ్య చిరంజీవి ఖైదీ నెం 786'లోని గువ్వా గోరింకతో..సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారని టాక్. మిక్కి జె.మేయర్ ఈ పాటను సరికొత్తగా రీమిక్స్ చేశాడని యూనిట్ వర్గాలు చెప్పాయి. ఈ సినిమా ఆడియో ఆగస్ట్ 23న విడుదలవుతోంది. అయితే ఈ ఆడియోలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ ఉండదట. ఆ పాటను స్పెషల్ సెప్టెంబర్ 24న విడుదలయ్యే సినిమాలో మాత్రమే కనపడుతుందట. సో..ఓ రకంగా చెప్పాలంటే మెగా అభిమానులకు అప్పటి వరకు నిరాశ తప్పదు.