వారి బాటలోనే చిరు అల్లుడు వెళతాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
జూలై నెల మెగా కుటుంబానికి బాగా కలిసొచ్చే నెలగా చెప్పుకోవచ్చు. ఈ నెలలో విడుదలైన వీరి సినిమాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సందర్భాలు అనేకం. అలాగే.. ఆ సినిమాలన్నీ జూలై సెకండ్ హాఫ్‌లో విడుదలై సంచలనాలను సృష్టించినవే కావడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘పసివాడి ప్రాణం’ జూలై 23, 1987న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలవగా.. మళ్ళీ సరిగ్గా 15 సంవత్సరాల తర్వాత జూలై 24, 2002న విడుదలైన ‘ఇంద్ర’ కూడా ఇండస్ట్రీ హిట్‌గానే నిలవడం విశేషం. అలాగే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘తొలిప్రేమ’ కూడా జూలై 24, 1998న విడుదలై ఇండస్ట్రీలో సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌ను మలుపుతిప్పిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మగధీర’ (జూలై 31, 2009) ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
అలాగే.. ‘ఫిదా’ (జూలై 21, 2017)తో తొలి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న ‘విజేత’ సినిమా కూడా జూలై నెలలోనే విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరి చిరు కుటుంబం నుంచి వస్తున్న ఈ యంగ్ హీరో కూడా ఇతర మెగా హీరోస్ లాగే.. జూలై సెంటిమెంట్ సాక్షిగా తన తొలి చిత్రంతోనే సంచలనాలను సృష్టిస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com