వారి బాట‌లోనే చిరు అల్లుడు వెళ‌తాడా?

  • IndiaGlitz, [Thursday,May 31 2018]

జూలై నెల మెగా కుటుంబానికి బాగా కలిసొచ్చే నెలగా చెప్పుకోవచ్చు. ఈ నెలలో విడుదలైన వీరి సినిమాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంద‌ర్భాలు అనేకం. అలాగే.. ఆ సినిమాలన్నీ జూలై సెకండ్ హాఫ్‌లో విడుదలై సంచలనాలను సృష్టించినవే కావడం విశేషం.

ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన‌ ‘పసివాడి ప్రాణం’ జూలై 23, 1987న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలవగా.. మళ్ళీ సరిగ్గా 15 సంవత్సరాల తర్వాత జూలై 24, 2002న విడుద‌లైన ‘ఇంద్ర’ కూడా ఇండస్ట్రీ హిట్‌గానే నిలవడం విశేషం. అలాగే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘తొలిప్రేమ’ కూడా జూలై 24, 1998న‌ విడుదలై ఇండస్ట్రీలో సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌ను మలుపుతిప్పిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మగధీర’ (జూలై 31, 2009) ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

అలాగే.. ‘ఫిదా’ (జూలై 21, 2017)తో తొలి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న ‘విజేత’ సినిమా కూడా జూలై నెలలోనే విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన విష‌యం తెలిసిందే. మరి చిరు కుటుంబం నుంచి వ‌స్తున్న ఈ యంగ్ హీరో కూడా ఇత‌ర‌ మెగా హీరోస్ లాగే.. జూలై సెంటిమెంట్ సాక్షిగా త‌న తొలి చిత్రంతోనే సంచలనాలను సృష్టిస్తారేమో చూడాలి.

More News

స‌రికొత్త సంచ‌నాల‌కు తెర తీస్తున్న  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్

ప్ర‌తిభ ఎక్క‌డున్నా చేతులు క‌ల‌ప‌డం రిల‌య‌న్స్ కు ఆది నుంచీ ఉన్న అల‌వాటు.

నాకు 'శంభో శంక‌ర' టైటిల్ బాగా న‌చ్చింది: విశాల్

శంక‌ర్ ని హీరోగా,  శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న 'శంభో శంక‌ర' చిత్రం

'అమ్మ‌మ్మ‌గారిల్లు' స‌క్సెస్ మీట్

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వంలో

'అల్లుడు శీను' మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా?

ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు అనే ట్యాగ్ లైన్‌తో ‘అల్లుడు శీను’ సినిమా ద్వారా క‌థానాయ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్.

సి.ఐ.డి ఆఫీస‌ర్‌గా మ‌హేష్‌?

బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ డిజాస్ట‌ర్స్‌ను అందుకున్నా..