చిరు చిన్నల్లుడు ఇతనే
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ వివాహం చేసుకోవడం..ఆతర్వాత విడాకులు తీసుకోవడం తెలిసిందే. అయితే... చిరుకి ప్రాణమైన రెండో కుమార్తె శ్రీజకి రెండో వివాహాం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో చిరు ఇంట పెళ్లి సందడి అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చిరు సతీమణి సురేఖకు సన్నిహితుల కొడుకు కళ్యాణ్ తో శ్రీజ వివాహాం చేసేందుకు నిర్ణయించారు.
కళ్యాణ్ - శ్రీజ కు క్లాస్ మేట్ అని మరో వార్త ప్రచారంలో ఉంది. ఎలాంటి ఆర్భాటం లేకుండా అతికొద్ది మంది అతిధుల సమక్షంలో ఈ వివాహాం చేయాలని పెద్దలు నిర్ణయించారట.ఇదిలా ఉంటే..ఎలా బయటకు వచ్చిందో కానీ... చిరు చిన్నల్లుడు ఇతనే...అంటూ కళ్యాణ్ ఫోటో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో హల్ చల్ చేస్తుంది. కళ్యాణ్ - శ్రీజ వివాహాన్ని ఈనెల 25న తిరుపతిలో జరిపేందుకు ముహుర్తం నిర్ణయించినట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com