కళాశాల నేపథ్యంలో చిరు అల్లుడి సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ తెలుగు తెరకు కథానాయకుడుగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. జత కలిసే` డైరెక్టర్ రాకేష్ శశి దర్శకత్వంలో తన తొలి చిత్రాన్ని చేస్తున్నాడు కళ్యాణ్. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రారంభోత్సవం కూడా లాంఛనంగా జరిగింది. చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇదిలా ఉంటే.. మాళవికా నాయర్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఈ సినిమా కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కుతోందని.. ఈ సినిమాకి ఎంచుకున్న కథాంశం ప్రేక్షకులని ఎంతో ఉత్కంఠకు గురి చేస్తుందని సమాచారం. ఇప్పటికే తన యాక్టింగ్ స్కిల్స్ ని మెరుగుపరుచుకున్న కళ్యాణ్ ఈ సినిమాకి ఏ విధంగా ప్లస్ అవుతారో చూడాలి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహాకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా తెరపైకి రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments