కళాశాల నేపథ్యంలో చిరు అల్లుడి సినిమా

  • IndiaGlitz, [Friday,February 02 2018]

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్‌ తెలుగు తెర‌కు క‌థానాయ‌కుడుగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. జత కలిసే' డైరెక్టర్ రాకేష్ శశి దర్శకత్వంలో త‌న తొలి చిత్రాన్ని చేస్తున్నాడు కళ్యాణ్. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రారంభోత్స‌వం కూడా లాంఛ‌నంగా జ‌రిగింది. చిరంజీవి ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఇదిలా ఉంటే.. మాళ‌వికా నాయ‌ర్‌ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఈ సినిమా కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కుతోంద‌ని.. ఈ సినిమాకి ఎంచుకున్న క‌థాంశం ప్రేక్షకులని ఎంతో ఉత్కంఠ‌కు గురి చేస్తుందని సమాచారం. ఇప్పటికే తన యాక్టింగ్ స్కిల్స్‌ ని మెరుగుపరుచుకున్న కళ్యాణ్ ఈ సినిమాకి ఏ విధంగా ప్ల‌స్ అవుతారో చూడాలి. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహాకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా తెర‌పైకి రానుంది.

More News

ఈ నెలలోనే రవితేజ, శ్రీను వైట్ల మూవీ

మాస్ మహారాజా రవితేజ,డెబ్యు డైరెక్టర్ విక్రమ్ సిరికొండ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘టచ్ చేసి చూడు’.

చరణ్ , బోయపాటి.. ఓ ఐటమ్ సాంగ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

రిలీజ్ కు ముందే ఓ చిన్న చిత్రానికి క్రేజీ ఆఫర్స్!!

ఓ నూతన దర్శకుడు,నూతన నిర్మాణ సంస్థలో రూపొందిన 'ఇంతలో ఎన్నెన్ని వింతలో'

జాతీయ మహిళా సదస్సు 2017...శిల్పారామం...హైదరబాద్

ఫ్రగ్న్యా భారతి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ మహిళా సదస్సు Feb 1 వ తేదీ నుంచి 3వ తేదీ వరకు హైదరబాద్ లోని శిల్ప కలా వేదిక యందు ఘనగా జరుగుతున్నాయి.

ఇందిరా గాంధీ పాత్ర కోసం ఆ ఇద్ద‌రు..

విక్టరీ వెంకటేష్, సెన్సేషనల్ డైరెక్టర్ తేజ కలయికలో 'ఆటా నాదే వేటా నాదే' (ప్ర‌చారంలో ఉన్న పేరు) సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ మూవీని 90 నుంచి 120 రోజుల్లో తేజ పూర్తిచేయనున్నారని కథనాలు వచ్చాయి. ఇప్పుడు వాటికి ఊతమిస్తూ.. తేజ ఈ చిత్రాన్ని శరవేగంగా అంటే ఆగష్టు నెలకల్లా పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింķ