చిరు లేకుండానే 'ఆచార్య' షూటింగ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ కోవిడ్ నేపథ్యంలో రీస్టార్ట్ అయ్యిందని సమాచారం. నవంబర్ 9న సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటే మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యూనిట్‌కు ముందుగా ఏం చేయాలో అర్థం కాలేదు. షూటింగ్‌ను వాయిదా వేద్దామంటే ఇంకా ఆలస్యం చేయడం భావ్యం కాదని డైరెక్టర్ కొరటాల శివ భావించారట. అందుకోసం చిరంజీవి లేని సన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తున్నారట. చిరంజీవి రావడానికి ఎలాగూ రెండు వారాల సమయం పడుతుంది కాబట్టి.. ఆలోపు వీలైనన్ని సన్నివేశాలను చిత్రీకరించాలనేదే యూనిట్ ప్లాన్ అని టాక్. చిరంజీవి జాయిన్ అయిన తర్వాత ఆయనపై సన్నివేశాలను చిత్రీకరిస్తారు. దాని తర్వాత చరణ్ జాయిన్ అవుతాడట. దేవాదాయశాఖలోని అవినీతిని ప్రశ్నించేలా దర్శకుడు కొరటాల కథను ప్రిపేర్ చేశాడు. చిరంజీవి మాజీ నక్సలైట్ పాత్రలో నటిస్తుంటే.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్ నక్సలైట్ నాయకుడు పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఈ సినిమాను రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com