చిరు లేకుండానే 'ఆచార్య' షూటింగ్‌..!

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ కోవిడ్‌ నేపథ్యంలో రీస్టార్ట్‌ అయ్యిందని సమాచారం. నవంబర్‌ 9న సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేయాలనుకుంటే మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో యూనిట్‌కు ముందుగా ఏం చేయాలో అర్థం కాలేదు. షూటింగ్‌ను వాయిదా వేద్దామంటే ఇంకా ఆలస్యం చేయడం భావ్యం కాదని డైరెక్టర్‌ కొరటాల శివ భావించారట. అందుకోసం చిరంజీవి లేని సన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తున్నారట. చిరంజీవి రావడానికి ఎలాగూ రెండు వారాల సమయం పడుతుంది కాబట్టి.. ఆలోపు వీలైనన్ని సన్నివేశాలను చిత్రీకరించాలనేదే యూనిట్‌ ప్లాన్‌ అని టాక్‌. చిరంజీవి జాయిన్‌ అయిన తర్వాత ఆయనపై సన్నివేశాలను చిత్రీకరిస్తారు. దాని తర్వాత చరణ్‌ జాయిన్‌ అవుతాడట. దేవాదాయశాఖలోని అవినీతిని ప్రశ్నించేలా దర్శకుడు కొరటాల కథను ప్రిపేర్‌ చేశాడు. చిరంజీవి మాజీ నక్సలైట్‌ పాత్రలో నటిస్తుంటే.. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌ నక్సలైట్‌ నాయకుడు పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఈ సినిమాను రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

More News

'సైనైడ్'లో ప్రముఖ మలయాళ నటులు సిద్దిఖ్... కన్నడ నటులు రంగాయన రఘు

పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల గ్రహీత రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో... జాతీయ పురస్కార గ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'సైనైడ్'.

'సీతాయణం' టీజర్ ని లాంచ్ చేసిన మాస్ మహారాజా రవితేజ !!

కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా  'సీతాయణం'.

రాజమౌళి విసిరిన ఛాలెంజ్‌కి తన స్టైల్లో రిప్లై ఇచ్చిన వర్మ

సంచలన దర్శకుడికి దాదాపు ఎవరూ సలహా ఇచ్చే సాహసం కానీ లేదంటే ఛాలెంజ్‌లు విసిరే సాహసం కానీ చేయలేరు.

ఇక నుంచి ఆన్‌లైన్ ఛానల్స్‌పై కేంద్రం నిఘా.. అశ్లీలత కట్టడికి చర్యలు..

ఓవర్‌ ది టాప్(ఓటిటి)లో పెరిగిపోతున్న అశ్లీలత కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆన్‌లైన్ ఛానల్స్‌పై కేంద్రం నిఘా ఉండనుంది.

ఎస్వీబీసీలో పోర్న్‌సైట్ కలకలం.. 25 మందిని గుర్తించిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు మారు పేరు. కొండపైకి మద్యం, మాంసాహారం వంటివన్నీ నిషేధం.