దాసరి గారి మరణం షాక్ కి గురిచేసింది : చిరంజీవి
Tuesday, May 30, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకరత్న దాసరిగారి అకాల మరణ వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇటీవలే ఆయన ఆనారోగ్యం కారణంగా అల్లు రామలింగయ్య గారి అవార్డును స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి నా చేతు మీదుగా అందజేశాను. ఆ సమయంలో ఆయనతో చాలా సేపు మాట్లాడటం జరిగింది. చాలా ఆరోగ్యంగా నాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను చైనాలో ఉన్నాను ఇంతలో ఇలాంటి చేదు వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం యావత్తు చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. దర్శక నిర్మాతగా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు అనీర్వచనీయం. ఇప్పటివరకూ తెలుగు సినిమాకు పెద్ద దిక్కులా ఉన్న ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం భాదాకరం. బౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన సేవలను ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటాం....చిరంజీవి
చిత్రపరిశ్రమకు తీరని లోటు : రామ్‌చరణ్
తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు గారి మరణం యావత్త్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను..రామ్ చరణ్
పెద్ద దిక్కును కోల్పోయాం: శివాజీ రాజా, నరేష్
అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుని చాలా త్వరగా కోల్కుని మళ్లీ ఇంటికొచ్చారు. ఇటీవలే ఫ్యాన్స్ సమక్షంలో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఇంతలోనే దాసరి గారి గురించి పెను విషాదం లాంటి వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. మా టీమ్ అందరికీ పెద్ద దిక్కులా ఉండే వ్యక్తిని మేము కోల్పోయాం. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలందించిన వ్యక్తి. దర్శక దిగ్గజం లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం.. `మా` అధ్యక్షులు శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నరేష్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments