దాసరి గారి మరణం షాక్ కి గురిచేసింది : చిరంజీవి

  • IndiaGlitz, [Tuesday,May 30 2017]

దర్శకరత్న దాసరిగారి అకాల మరణ వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇటీవలే ఆయన ఆనారోగ్యం కారణంగా అల్లు రామలింగయ్య గారి అవార్డును స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి నా చేతు మీదుగా అందజేశాను. ఆ సమయంలో ఆయనతో చాలా సేపు మాట్లాడటం జరిగింది. చాలా ఆరోగ్యంగా నాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను చైనాలో ఉన్నాను ఇంతలో ఇలాంటి చేదు వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం యావత్తు చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. దర్శక నిర్మాతగా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవ‌లు అనీర్వచనీయం. ఇప్పటివరకూ తెలుగు సినిమాకు పెద్ద దిక్కులా ఉన్న ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం భాదాకరం. బౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన సేవల‌ను ఎప్పుడూ స్మరించుకుంటూనే ఉంటాం....చిరంజీవి
చిత్రపరిశ్రమకు తీరని లోటు : రామ్‌చరణ్‌
తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు దర్శకరత్న డా॥ దాసరి నారాయణరావు గారి మరణం యావత్త్ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కల‌గాల‌ని కోరుకుంటున్నాను..రామ్ చ‌ర‌ణ్
పెద్ద దిక్కును కోల్పోయాం: శివాజీ రాజా, న‌రేష్‌
అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో ట్రీట్ మెంట్ తీసుకుని చాలా త్వ‌ర‌గా కోల్కుని మ‌ళ్లీ ఇంటికొచ్చారు. ఇటీవ‌లే ఫ్యాన్స్ స‌మ‌క్షంలో ఘనంగా పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఇంత‌లోనే దాస‌రి గారి గురించి పెను విషాదం లాంటి వార్త‌ను వినాల్సి వ‌చ్చింది. ఆయ‌న మ‌ర‌ణం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. మా టీమ్ అంద‌రికీ పెద్ద దిక్కులా ఉండే వ్య‌క్తిని మేము కోల్పోయాం. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎన్నో సేవ‌లందించిన వ్య‌క్తి. ద‌ర్శ‌క దిగ్గ‌జం లేర‌న్న వార్త‌ను జీర్ణించుకోలేక‌పోతున్నాం.. 'మా' అధ్య‌క్షులు శివాజీ రాజా, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్‌

More News

దాసరి ఆరోగ్యం నిలకడగా ఉంది - కిమ్స్ వైద్యులు

టాలీవుడ్ దర్శక గురువు దర్శకరత్న డా.దాసరినారాయణరావు ఆరోగ్యంపై ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

ఈ మధ్య కాలంలో విన్న సబ్జెక్ట్స్ లో ఎగ్జయిట్ మెంట్ తో చేసిన సినిమా 'అంధగాడు' - రాజ్ తరుణ్

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత యువ కథానాయకుడు రాజ్తరుణ్ హీరోగారూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

ఎవరూ క్లాసిక్ మూవీస్ ను ముందుగా ప్లాన్ చేసుకోలేరు - మధుర శ్రీధర్ రెడ్డి

స్నేహగీతం సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన మధుర శ్రీధర్ రెడ్డి , ఇట్స్ మై లవ్స్టోరీ, బ్యాక్బెంచ్ స్టూడెంట్స్ సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత నిర్మాతగా మారారు.

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ 'జవాన్' చిత్రం టాకీ పార్ట్ పూర్తి

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అదర గొడుతున్న దువ్వాడ

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ డిజె దువ్వాడ జగన్నాథమ్గా జూన్ 23న సందడి చేయనున్నాడు. ఈలోపు యూనిట్ ప్రమోషన్ వర్క్స్లో బిజీగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటల్లో ఒక్కొక్క పాటను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.