‘వైల్డ్ డాగ్’ చూశాక అడ్రినల్ రష్‌లాగా వచ్చింది: చిరు
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా, అప్పాజీ అంబరీష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం(ఏప్రిల్ 2)న విడుదలై సక్సెస్ టాక్‌ను సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ ప్రెస్మీట్లో మెగాస్టార్ చిరంజీవి సైతం పాల్గొని సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా మనమంతా గర్వపడేంత గొప్ప సినిమా అని తాను ఫీలవుతున్నానన్నారు.
‘‘ఈ సినిమాపై నాకు పెద్దగా క్యూరియాసిటీ లేదు. ఎందుకంటే గోకుల్ ఛాట్.. ఒక వాస్తవ కథను తెరకెక్కిస్తున్నారు కాబట్టి డ్రైగా ఉంటుందనే తక్కువ భావన ఉండేది. నాగ్ ఉన్నాడు కాబట్టి రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అవేమీ లేవు కాబట్టి ఎక్కడో చిన్న తక్కువ భావన నాకుంది. కానీ నాకు సినిమా చూసిన తర్వాత ఒక అడ్రినల్ రష్‌లాగా వచ్చింది. ఒక గగుర్పాటు కానివ్వండి.. ఆద్యంతం ఉత్కంఠ కొనసాగింది. రెండున్నర గంటలు ఎలాంటి బ్రేక్ లేకుండా, ఆఖరికి ఇంటర్వెల్ కూడా తీసుకోకుండా ఈ చిత్రాన్ని వీక్షించాను. అంతలా నేను ఉత్కంఠకు లోనయ్యాను. ఆగలేక వెంటనే నాగ్‌కు ఫోన్ చేసి ఇది చాలా గొప్ప సినిమా.. ఎక్కడా తగ్గకుండా చూపించారు. ఈ సినిమా గురించి మాట్లాడేవాళ్లు లేరు ఒక్క ఆడియెన్స్ తప్ప. అందుకే ఆడియెన్స్‌కి ధన్యవాదాలు చెప్పేందుకు ఈ సినిమా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.
‘ఉరి’ చూసినప్పుడు మనం ఇలాంటి సినిమాలు ఎందుకు చెయ్యట్లేదనే భావనతో ఉన్న నాకు.. నాగార్జున ఇలాంటి సినిమా చేయడం చాలా ఆనందంగా అనిపించింది. కొన్ని కొన్ని సీన్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. ఈ సినిమా ఎమోషనల్‌గా నాకు కనెక్ట్ అయింది. భారతీయుడిగా ఈ సినిమా నన్ను ఆకట్టుకుంది. తెలుగువాళ్లు కూడా ఇలాంటి చిత్రాలు అత్యద్భుతంగా చేయగలరు అనిపించేలా సినిమా రూపొందించారు. కొన్ని పోరాట సన్నివేశాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. ఇందులోని కొన్ని సన్నివేశాలు చూసి ఓ భారతీయుడిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఓ సీన్లో విలన్ని పట్టుకున్నప్పుడు నాగ్ చెప్పిన డైలాగ్‌కి నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఈ సినిమా మొత్తం పూర్తయ్యాక నా నోటివెంట జైహింద్ అనే మాటలు వెలువడ్డాయి. తక్కువ బడ్జెట్‌తో, అల్ప సమయంలో ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాల్మన్, నిర్మాతలకు హృదయపూర్వక అభినందనలు. ప్రేక్షకుల అభిరుచి కూడా ఎంతో మారింది. కొత్త తరహా చిత్రాలను వాళ్లు ఆహ్వానిస్తున్నారు. ఈ సినిమా చూసిన వారందరికీ నా ధన్యవాదాలు. అలాగే అందరూ ఈ చిత్రాన్ని తప్పక వీక్షించాలని కోరుకుంటున్నా’’ అని చిరు పేర్కొన్నారు.
సినీ కార్మికులకు ఉచిత టీకా..
ఈ సందర్భంగా సినీ కార్మికుల విషయాన్ని కూడా మెగాస్టార్ ప్రస్తావించారు.‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కొవిడ్-19 టీకా ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ‘గతేడాది కరోనా వైరస్ సృష్టించిన క్లిష్ట పరిస్థితుల్లో కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు సాయం చేశాం. అందులో ఇంకొంత మొత్తం మిగిలి ఉంది. దానితో సినీ కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ ఇప్పించాలనే ఆలోచన మాకు వచ్చింది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం’ అని చిరు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments