అరుదైన ఫొటోను షేర్ చేసిన చిరు...!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలందరూ వారు తీసిన అరుదైన ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన ఫొటోను షేర్ చేశారు. ‘‘నేను తీసిన మొదటి ఫోటో ... ... ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు ... ...చెప్పుకోండి చూద్దాం’’ అన్నారు చిరు. తాను అగ్‌ఫా 3 కెమెరాతో తొలి ఫొటోను తీశానని చరు తెలిపారు. ఇక చిరు చెప్పిన ఆ వ్యక్తి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అని అభిమానులు, నెటిజన్స్ సమాధానం ఇస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే... మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152వ చిత్రం ‘ఆచార్య’ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. కరోనా కారణంగా ఆగిన ఈ సినిమాను పరిస్థితులు చక్కబడ్డ తర్వాత స్టార్ట్ చేయనున్నారు. మరో వైపు చిరు పుట్టినరోజు ఆగస్ట్ 22. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణ, నిరంజన్ రెడ్డి నిర్మాతగా సినిమా రూపొందుతుంది. చిరంజీవి ఇందులో నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తదుపరి షెడ్యూల్‌లో రామ్‌చరణ్ నటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.
నేను తీసిన మొదటి ఫోటో ... ... ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు ... ...చెప్పుకోండి చూద్దాం. #FirstPhotoTaken #WorldPhotographyDay pic.twitter.com/YyesoiiivX
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 19, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com