మెగాస్టార్ మాటిచ్చాడంటే.. నిలబడతాడంతే..
Send us your feedback to audioarticles@vaarta.com
సేవాభావానికి ప్రతిరూపం మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయం ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ కరోనా కష్ట కాలంలో చిరంజీవి ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించడం, విరాళాలు సేకరించి సినీ కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించడం లాంటి కార్యక్రమాల్లో చిరు ముందు ఉంటున్నారు.
కరోనా సెకండ్ వేవ్ లో అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందక చాలామంది పేషంట్లు ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా తనవంతుగా సాయం చేయాలని చిరంజీవి గొప్ప కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చిరు కొన్ని రోజుల క్రితమే మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చిరంజీవి ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్స్ కొరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్స్ నిర్వహణ జరుగుతోంది. గుంటూరు, శ్రీకాకుళం, అనంతపూర్, పశ్చిమగోదావరి లాంటి జిల్లాలో బుధవారం రోజు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి. అన్ని జిల్లాలో అవసరమైన చోటుకు ఆక్సిజన్ అందించనున్నారు.
చిరంజీవి మాట్లాడుతూ.. అవసరమైన చోటుకు ఆక్సిజన్ అందుతుందా లేదా అని తెలుసుకునేందుకు ట్రాకింగ్ సిబ్బందిని కూడా నియమిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. చైనా నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఆర్డర్ చేసినట్లు చిరు తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్యవేక్షిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com